నాగబాబు నామినేషన్ రేపు… కానీ..!

నాగబాబు నామినేషన్ అన్నది జనసేన వన్ సైడ్ వ్యవహారమా? లేక కూటమి వ్యవహారమా?

జనసేన నేత కొణిదెల నాగబాబు ఎమ్మెల్సీ పదవికి పోటీ పడుతూ నామినేషన్‌ను రేపు దాఖలు చేయబోతున్నారు. సోషల్ మీడియా ఫాలో అయ్యే వారికి ఈ వార్త తెలుసు. కొత్తగా చెప్పనక్కరలేదు. కానీ తెలుగుదేశం మద్దతు మెయిన్ స్ట్రీమ్ మీడియా వెబ్ సైట్లు ఒక్కసారి ఈ క్షణంలో చూస్తే ఈ వార్త కనిపించదు.

ఈ రోజు ప్రింట్ మీడియాలో కూడా కొన్ని ఈ విషయం జస్ట్ రిపోర్ట్ చేసి వదిలాయి. మరి కొన్ని రిపోర్డ్ చేయలేదు. రిపోర్ట్ చేసినవి కూడా అసలు కూటమి తరపున కాకుండా సోలోగా జనసేన ఎందుకు ప్రకటించాల్సి వచ్చిందో అన్నది విశ్లేషించలేదు.

సరే, అది అయిపోయింది ఈ రోజు సాయంత్రం నాగబాబు రేపు నామినేషన్ వేస్తారనే విషయం జనసేన సోషల్ మీడియా హ్యాండిల్స్ లో వైరల్ అయింది. నామినేషన్ పత్రాలు సంతకం చేస్తున్న నాగబాబు ఫొటోలు సోషల్ మీడియాలోకి వదిలారు. కానీ ఇవన్నీ కూడా ఒక్క మెయిన్ స్ట్రీమ్ మీడియా వెబ్ సైట్ ల్లో కనిపించలేదు.

అసలు ఏం జరుగుతోంది..? ఎందుకిలా..? కూటమిలో ఏం జరుగుతోంది..? నాగబాబు నామినేషన్ అన్నది జనసేన వన్ సైడ్ వ్యవహారమా? లేక కూటమి వ్యవహారమా? అన్నదే క్లారిటీ లేదు. కొన్ని రోజులు ఆగితే అసలు కథలు బయటకు వస్తాయేమో?

10 Replies to “నాగబాబు నామినేషన్ రేపు… కానీ..!”

Comments are closed.