బిగ్‌బాస్ సీజన్ -5 అలా ముందుకు సాగుతోంది. బిగ్‌బాస్ ఇంట్లో రాజకీయం బయటి రాజకీయాన్ని తలదన్నేలా కంటెస్టెంట్స్ ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. కెప్టెన్సీ టాస్కెలో సభ్యులు తమ మధ్య బంధాలను కూడా పక్కన పెట్టి….మరీ టార్గెట్ చేసుకుంటున్నారు.
ఇదంతా గేమ్‌లో భాగమని చెప్పుకున్నా… పవర్‌కున్న లక్షణం అది అని చెప్పొచ్చు. బిగ్‌బాస్ ఇంట్లో కంటెస్టెంట్లు తమకిష్టమైన వాళ్లతో ఎవరికి వారుగా ఉంటున్నారు. దీంతో సహజంగానే వర్గాలు ఏర్పడ్డాయి. కొన్ని జంటల మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. అలాంటి జంటల్లో షణ్ను-సిరి; మానస్- పింకీల గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
తాజాగా హౌస్‌లో కెప్టెన్సీ కోసం బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్‌లో రెండు జట్లు నువ్వానేనా అన్నట్టు గట్టిగా తలపడుతున్నాయి. రెండు జట్లు కూడా ఏ మాత్రం తీసిపోకుండా టాస్క్‌లు చేస్తుండడం గమనార్హం. ఈ క్రమంలో ఇన్నర్స్ దుస్తుల విషయమై మొదలైన చిన్న వాదన సిరి క్యారెక్టర్ గురించి షణ్ను కామెంట్ చేసే వరకూ వెళ్లింది. ఇది గొడవకు దారి తీసింది. సాన్నిహిత్యంగా మెలుగుతూ వచ్చిన జంట మధ్య షణ్ను నోరు జారడం వల్ల విభేదాలకు దారి తీసింది.
టాస్క్‌లో భాగంగా విలన్లు రాక్షసావతారం ఎత్తి ఇల్లంతా చెల్లాచెదరు చేశారు. సిరి బట్టలన్నీ విసిరిపారేసింది. దీంతో కెప్టెన్ హోదాలో షణ్ను అధికార దర్పాన్ని ప్రదర్శించాడు. ఇన్నర్స్ ఎందుకు బయటకు తీశావని సిరిని నిలదీశాడు. ఇన్నర్స్ సర్దేయడానికి సిరి అంగీకరించింది. ప్రస్తుతం తన వేళ్లు పని చేయడం లేదని, రెండు నిమిషాలు వెయిట్ చేయాలని అభ్యర్థించింది. అందుకు షణ్ను అంగీకరించలేదు. ఆ పని ఇప్పుడే చేసి తీరాలని ఆదేశించాడు.
షణ్ను ఆజ్ఞాపించడం సిరికి నచ్చలేదు. ఆమెకు కోపం వచ్చింది. దీంతో ఇన్నర్స్ తీయనని మొహం ఎదుటే తేల్చి చెప్పింది. కెప్టెన్ ఆదేశాలు పాటించపోవడం షణ్నుకు ఇగో దెబ్బతింది. ఇది నీ క్యారెక్టర్.. అని సిరిపై నోరు జారాడు షణ్ను. హౌస్‌లో అందరి కంటే సన్నిహితుడిగా భావించే షణ్ను నోట తన క్యారెక్టర్ గురించి అభ్యంతరకర మాట రావడంతో సిరి హర్ట్ అయ్యింది.
బట్టలు తీయడానికి, క్యారెక్టర్‌కు సంబంధం లేదని తన నిరసన వ్యక్తం చేస్తూనే సిరి ఏడ్చేసింది సిర. ఈ దెబ్బల కన్నా నువ్వనే మాటలే ఎక్కువ బాధగా ఉన్నాయంటూ సిరి వెక్కివెక్కి ఏడ్వడం చూపరులకు జాలి కలిగించింది. ఇదే సమయంలో షణ్ను ప్రవర్తనపై కోపం తెప్పించింది.