సిరివెన్నెల రాసిన సిరివెన్నెలలో

శ్యామ్ సింగరాయ్…ఈ నెలలో రాబోతున్న ప్రామిసింగ్ సినిమాల్లో ఒకటి. నాని-సాయిపల్లవి కాంబినేషన్ లో తయారైన ఈ సినిమా కోసం కవి సిరివెన్నెల రాసిన పాటను విడుదల చేసారు. పూర్తి నిడివి వీడియో సాంగ్ గా…

శ్యామ్ సింగరాయ్…ఈ నెలలో రాబోతున్న ప్రామిసింగ్ సినిమాల్లో ఒకటి. నాని-సాయిపల్లవి కాంబినేషన్ లో తయారైన ఈ సినిమా కోసం కవి సిరివెన్నెల రాసిన పాటను విడుదల చేసారు. పూర్తి నిడివి వీడియో సాంగ్ గా విడుదల చేసిన ఈ పాట భావ స్ఫూరితంగానూ, నేత్రపర్వంగానూ వుంది.

నెలరాజు….ఇలరాణిని కలిపింది కదా….సిరివెన్నెల అంటూ ప్రారంభమైన ఈ గీతాన్ని బెంగాల్ నేపథ్యంలో వామపక్ష భావాల రచయిత హీరో, దేవదాసీ హీరోయిన్లు అనిపించేలాంటి పాత్రల మీద ఈ పాటను చిత్రీకరించారు. వీడియో ప్రకారం కథలోని కీలక ఘట్టంలో ఈపాట వస్తుందని తెలుస్తోంది. 

హీరోయిన్ ఇంట్లో వాళ్లకి తెలియకుండా నడిరాతిరి వేళ హీరోతో వెళ్లిపోయే సన్నివేశాలు పాట విడియోలో వున్నాయి. 

''…దూరమా..దూరమా..తీరమై చేరుమా…నడి రాతిరిలో తెరలు తెరచి..నది నిద్దురలో…మగత మరచి ఉదయించిందా…కులకు లొలుకు చెలి మొదటి కల…తన నవ్వులలో…తళకు తళకు తన చెంపలలో….'' అంటూ లాలిత్యంగా సాగింది సిరివెన్నెల రచన.  తెరదాటి..చెరదాటి..అంటూ చేసిన పద ప్రయోగం బాగుంది.

పాట ట్యూన్ మాత్రం ఎక్కడో ఎప్పుడో విన్న ఫీలింగ్ ఇస్తోంది. టోటల్ గా కలర్ ఫుల్ గా పాట సినిమాకు యాడెడ్ అడ్వాంటేజ్ అయ్యేటట్లే వుంది.