పేరులోనేముంది అన్నదే ఇప్పుడు సినిమా జనాల క్వశ్చను. కొత్తదనం అన్నది అక్కడి నుంచే కనిపించడం మొదలుపెట్టాలి. అందుకే టైటల్ దగ్గరే మాగ్జిమమ్ కేర్ తీసుకుంటారు.
`118` అనే టైటిల్ పెట్టి సక్సెస్ఫుల్ చిత్రాన్నితెరకెక్కించిన సినిమాటోగ్రాఫర్ కేవి గుహన్ తన తరవాత సినిమాకు డబ్ల్యు.డబ్ల్యు.డబ్ల్యు అని టైటిల్ ఫిక్స్ చేసారు.
అథిత్ అరుణ్, శివాని రాజశేఖర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నఈ మూవీని రామంత్ర క్రియేషన్స్ పతాకంపై డా. రవి పి. రాజు దట్ల నిర్మిస్తున్నారు.
118 తరువాత గుహాన్ కు మంచి ఆఫర్లే వచ్చాయి. అందులో ఇది ఒకటి. ఇది కాక దిల్ రాజు నిర్మాణంలో కూడా ఓ సినిమాచేయాల్సివుంది. ముందుగా ఈ డబ్ల్యు.డబ్ల్యు.డబ్ల్యు ను సైలంట్ గా ఫినిష్ చేసేసారు.
పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఊపందుకున్నాక టైటిల్ బయటకు వదిలారు. త్వరలో లోగోలు, ఫస్ట్ లుక్ లు బయటకు వస్తాయి.