స్కంధ ట్రయిలర్ పై పెదవి విరుపు

జనాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న రామ్-బోయపాటి కాంబో స్కంధ ట్రయిలర్ వచ్చేసింది. కానీ అంత యునానిమస్ పాజిటివ్ రిపోర్ట్ రాలేదు. బోయపాటి సినిమాల్లోంచి తలా ముక్క తీసి, కట్ చేసి కలిపితే చూసిన ఫీలింగ్ వచ్చిందన్నది…

జనాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న రామ్-బోయపాటి కాంబో స్కంధ ట్రయిలర్ వచ్చేసింది. కానీ అంత యునానిమస్ పాజిటివ్ రిపోర్ట్ రాలేదు. బోయపాటి సినిమాల్లోంచి తలా ముక్క తీసి, కట్ చేసి కలిపితే చూసిన ఫీలింగ్ వచ్చిందన్నది నెటిజన్ల కామెంట్. 

ఒక విధంగా అలాగే వుంది కూడా. ట్రయిలర్‌ లో కొత్తదనం నాట్ వన్ పర్సంట్ కనిపించలేదు. బోయపాటి సినిమాల్లో చూసేసిన రకరకాల షాట్‌లు, అవే డైలాగులు. ఇక రామ్ వైపు నుంచి కూడా కొత్తదనం కనిపించలేదు. ఎందుకంటే ఇస్మాట్ శంకర్ స్టయిల్ అనిపించేసింది.

అయితే పాజిటివ్ గా దీన్ని తీసుకున్నవారు కూడా వున్నారు. బోయపాటి మాస్ స్టయిల్ మరింత పదును తేలిందని, ఊచకోత, నరుకుడు మరింత బలంగా వున్నాయని, పవర్ ఫుల్ మాస్ డైలాగులు పడ్డాయని అన్నవారు కూడా వున్నారు.

ఈ ఇరు వైపుల సంగతి అలా వుంచితే ట్రయిలర్ లో అస్సలు కథ రివీల్ చేయలేదు. ఫ్యామిలీ స్టోరీ వుందా? రామ్ డబుల్ రోల్ చేసాడా? అన్న చిన్న చిన్న పాయింట్లు తప్ప మరేం లేదు. అలాగే హీరోయిన్ శ్రీలీలకు కూడా గొప్ప పాత్ర ఏమీ వున్నట్లు కనిపించలేదు. 

కానీ ఇప్పుడు ఈ సినిమాకు కావాల్సింది అదే. బలమైన కథ వుండాలి. ఎందుకంటే రామ్ రొటీన్ యాక్షన్, బోయపాటి రొటీన్ సీన్లు, డైలాగులు ఇవన్నీ కలిసి సీన్లు పండించాలంటే బలమైన కథ వుండాలి. ఆ విషయం ట్రయిలర్ లో చెప్పలేదు సినిమాలో చెబుతారేమో చూడాలి.