‘స్కంద’ నాన్ థియేటర్ @ 98 కోట్లు

ఇటీవల చిత్రమైన పరిస్థితి నెలకొంది టాలీవుడ్ లో. కొన్ని సినిమాలకు నాన్ థియేటర్ అమ్మకాలు కావడమే కష్టంగా వుంటోంది. కొన్ని సినిమాలకు భారీ రేట్లు దక్కుతున్నాయి. ఈ వారం విడుదల కాబోయే మైత్రీ-విజయ్ దేవరకొండ-సమంత…

ఇటీవల చిత్రమైన పరిస్థితి నెలకొంది టాలీవుడ్ లో. కొన్ని సినిమాలకు నాన్ థియేటర్ అమ్మకాలు కావడమే కష్టంగా వుంటోంది. కొన్ని సినిమాలకు భారీ రేట్లు దక్కుతున్నాయి. ఈ వారం విడుదల కాబోయే మైత్రీ-విజయ్ దేవరకొండ-సమంత సినిమాకు 90 కోట్ల వరకు నాన్ థియేటర్ ఆదాయం వచ్చింది. అలాగే మరో రెండు వారాల్లో విడుదల కాబోయే రామ్-బోయపాటి స్కంద సినిమాకు 98 కోట్లు నాన్ థియేటర్ ఆదాయం వచ్చింది.

రామ్ పోతినేని, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రెడీ అవుతున్న సినిమా 'స్కంద'. వినాయక చవితి సీజన్ టార్గెట్ చేస్తూ సెప్టెంబర్ 15న రిలీజ్ చేస్తున్నారు. ట్రైలర్ కట్ లో బోయపాటి శ్రీను స్టైల్ ఆఫ్ మాస్ కనిపించింది. తెర నిండుగా ఆరిస్టులు ఉన్నారు. పాన్ ఇండియా లెవెల్ రిలీజ్ కనుక గట్టిగా ఖర్చు చేసినట్టు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. 'స్కంద'కు బడ్జెట్ ఎంత అయ్యిందనేది పక్కన పెడితే, నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా నిర్మాత శ్రీనివాసా చిట్టూరికి గట్టిగా గిట్టుబాటు అయ్యింది. సుమారు 98 కోట్ల రూపాయలు వచ్చాయని తెలిసింది.

'స్కంద' సౌత్ లాంగ్వేజెస్ శాటిలైట్, డిజిటల్ రైట్స్ స్టార్ నెట్వర్క్ గ్రూప్ 54 కోట్ల రూపాయలకు సొంతం చేసుకుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ వెర్షన్స్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతాయి. స్టార్ ఛానళ్లలో సినిమా టెలికాస్ట్ అవుతుంది. హిందీ వెర్షన్ ఓటీటీ, శాటిలైట్ & థియేట్రికల్ రైట్స్ రూ. 35 కోట్లకు జీ స్టూడియోస్ తీసుకుంది. చిత్రనిర్మాణంలో జీ సంస్థ కూడా భాగస్వామి అని తెలిసిందే. ఆడియో రైట్స్ ద్వారా మరో రూ. 9 కోట్లు వచ్చాయి. రిలీజ్‌కు ముందు ఇంత అమౌంట్ రావడం రికార్డ్.

తెలుగు థియేట్రికల్ రైట్స్ కూడా గట్టిగానే విక్రయించారు. థియేటర్ నుంచి దాదాపు 50 కోట్ల వరకు సంపాదించారు.  ఇప్పటికే 'స్కంద' నుంచి మూడు సాంగ్స్ వచ్చాయి. ఫస్ట్ రెండు సాంగ్స్ వైరల్ కాగా, రీసెంట్ రిలీజ్ 'డుమ్మారే డుమ్మా' పాటలో ఫ్యామిలీ బాండింగ్ చూపించారు. రామ్ సరసన శ్రీ లీల నటించిన ఈ సినిమాలో సయీ మంజ్రేకర్ సెకండ్ లీడ్. శ్రీకాంత్, గౌతమి, ప్రిన్స్, ఇంద్రజ, పృథ్వీ తదితరులు ఇతర తారాగణం.