రామ్-బోయపాటి కాంబినేషన్‌లో తయారవుతున్న సినిమా స్కంధ. శ్రీలీల యాడెడ్ అట్రాక్షన్. ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు పాటలు వచ్చి వైరల్ అవుతున్నాయి. సెప్టెంబర్ 15న విడుదలకు సిద్దమవుతోంది. ఈ సినిమా థియేటర్ రైట్స్ ఇప్పటి వరకు ఇంకా మార్కెట్ చేయలేదు. నిర్మాత చిట్టూరి శ్రీను కు రెగ్యులర్ బయ్యర్లు వున్నారు. వాళ్లకే చాలా వరకు ఇస్తారు. అందువల్ల రేటు డిసైడ్ చేయడం ఒక్కటే తరువాయి.
ప్రస్తుతానికి ఆంధ్ర ఏరియాకు 25 కోట్ల మేరకు రేటు డిసైడ్ చేసినట్లు తెలుస్తోంది. బోయపాటి… రామ్.. శ్రీలీల కాంబినేషన్, ప్రాజెక్టు కు వున్న క్రేజ్ రీత్యా ఆంధ్ర ఏరియాకు 25 కోట్లు అంటే కేక్ వాక్ అనే చెప్పుకోవాలి. ఈ లెక్కన ఉత్తరాంధ్రకు 6 కోట్లు పడుతుంది. సినిమా ఏమాత్రం పాటలు ఫైట్లు బాగున్నా వసూళ్లు సులువే అవుతుంది.
మరి ఈ లెక్కన నైజాం, సీడెడ్ ఎంత కడతారో చూడాలి. మొత్తం మీద చూస్తుంటే 70 కోట్లకు పైగానే థియేటర్ బిజినెస్ జరిగేలా వుంది. చిట్టూరి శ్రీను నిర్మాతగా పవన్ కుమార్ నిర్వహణలో ఈ సినిమా రెడీ అవుతోంది.