తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఎప్పుడో 1999 నుంచి విజన్ 2020 అంటూ వచ్చారు. విజన్ 2020 అనే మాటను ఒకటికి వేయి సార్లు చెబుతూ వచ్చారు. అయితే విజన్ ఏమిటో ఎప్పుడూ చెప్పలేదు. విజన్ 2020 అనే మాట బాగుందన్నట్టుగా దాన్ని చెబుతూ వచ్చారు. అధికారం కోల్పోయాకా.. తను ఎప్పుడో చెప్పానంటూ మరో దీర్ఘం తీస్తూ వచ్చారు. అదేంటో కానీ.. 2020 రానే వచ్చింది, ఆ సంవత్సరం ప్రపంచానికి అల్లకల్లోలాన్ని మిగిల్చింది.
2020లో అంటే ప్రజలకు గుర్తున్నది కరోనాతో. అలాంటి వ్యాధి ఒక వ్యాపిస్తుందని, అలాంటి వైరస్ ప్రపంచాన్ని స్తంభింపజేస్తుందని, ఊహకు అందని రీతిలో ఎక్కడివాళ్లు అక్కడ ఇళ్లకు పరిమితం అయ్యే పరిస్థితి వస్తుందని ఎవ్వరూ కలలో కూడా ఊహించలేదు. కేవలం ఎక్కడి వారిని అక్కడకు పరిమితం చేయడమే కాదు, కొన్ని లక్షల ప్రాణాలను తీసింది కరోనా. ఈ ప్రభావం నుంచి ఏ దేశం తప్పించుకోలేకపోయింది.
భారతదేశం కూడా కరోనాతో విలవిల్లాడింది. దేశంలో కొన్ని కోట్ల మంది ఉపాధి అవకాశాలను కరోనా దెబ్బ తీసింది. అనేక రకాల పరిశ్రమలను దెబ్బతీసింది. కరోనా పరిస్థితుల వల్ల ఇప్పటికీ కోలుకోలేకపోతున్న పరిశ్రమలు చాలానే ఉన్నాయి. తమ జీవితంలో చీకటి అధ్యాయంగా కరోనా నాటి పరిస్థితులను వివరించే వారు బోలెడంత మంది ఉన్నారు. కరోనా వల్ల అనేకమంది తమ ఆప్తులను కోల్పోయారు. ఇలా 2020 ఒక చీకటి సంవత్సరంగా నిలిచింది. చంద్రబాబు ఎప్పుడో 2020 సంవత్సరం గురించి చెబుతూ వచ్చారు. అదేమో ఒక దారుణమైన అనుభవంగా మిగిలిపోయింది.
మరి ఇప్పుడు ఈ విజనరీ 2047 అనే కొత్త రాగం అందుకున్నారు. మరి ఈ విజనరీకి మతి భ్రమించిన దశలో విజన్ గురించి మాట్లాడటం విడ్డూరం. దేశంలో ఎక్కడ ఏ ప్రగతి ఆవిష్కృతం అయినా.. అదంతా తన వల్లనే, అంతా తానేనంటూ చెప్పుకోవడం చంద్రబాబుకు అలవాటే. ఈ విషయంలో ఎంత నవ్వుల పాలైనా, ఆధారాలతో సహా అడ్డంగా దొరికినా చంద్రబాబు తీరు మారదు. ఇదే క్రమంలో ఆయన విజన్ డబ్బా కూడా కొనసాగుతూ ఉంది.
మరి ఆ విజన్ 2047 అనే కార్యక్రమంలో అయినా చంద్రబాబు నాయుడు సూటిగా మాట్లాడారా.. అంటే అది కూడా లేదు! ఇంటర్లో ఇంజనీరింగ్, అందులో బైపీసీ తీసుకోవాలి.. అంటూ ఏదేదో మాట్లాడారు. చాన్నాళ్లుగా చంద్రబాబు నాయుడు తనేం మాట్లాడుతున్నారో అనే అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారు. ఈ క్రమంలో ఆయన నోటీ నుంచి ఇలాంటి అసంబద్ధమైన మాటలే వస్తున్నాయి. సైకిల్ పోవాలి.. సైకిల్ పోవాలి.. అంటూ కూడా ఆయన బాహాటంగా నినదించారు.
తిరుపతికి తను రిగ్గింగ్ చేసుకోవడానికి వెళితే అడ్డుకున్నారన్నారు. ఎవరైనా ఏదైనా చెబితే వారిని బెదిరించడం, వినవయ్యా అంటూ గద్ధించడం కూడా చంద్రబాబు ధోరణే. ఇక ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో.. అమరావతిలో 2018లో ఒలింపిక్స్ అని, ఒలింపిక్స్ తో పతకం తీసుకొస్తే వారికి నోబెల్ బహుమతి ఇస్తానంటూ తనే అనౌన్స్ చేసినట్టుగా కూడా చంద్రబాబు నాయుడు చెప్పుకున్నారు.
చంద్రబాబు వయసు వారికి ఇలా మతిభ్రమించడం సహజమే. ఇందులో ఆయన తప్పేం లేకపోవచ్చు. ఆయన వయసు వల్ల అలా మాట్లాడుతూ ఉండవచ్చు. తనేం మాట్లాడుతున్నానో తనే గ్రహించలేని స్థితి అది. వయసు ప్రభావం వల్ల చంద్రబాబు నాయుడు అలా మాట్లాడుండవచ్చు. మరి ఇలా మాట్లాడే వ్యక్తితను మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఆశించడమే విడ్డూరంగా ఉంది.
తనేం మాట్లాడుతున్నానో కూడా తను గ్రహించలేని స్థితిలో ఉంటూ, సైకిల్ పోవాలి, ఇంటర్లో ఇంజనీరింగ్ బైపీసీ గ్రూప్ అంటూ తనకే మతి లేనట్టుగా మాట్లాడుతున్న ఈ మేధావి విజన్ 2047 అనడం మరో కామెడీ. ఆఖరికి ఇలా తనేం మాట్లాడుతున్నానో తనే అర్తం చేసుకోలేని ఒక వృద్ధుడు భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాడు. దాన్ని జనం మీద రుద్దేందుకు కొందరు పోటీ పడుతున్నారు! విజన్ అంటే కల అట! ఇదీ ఆ మహానుభావుడు సెలవిచ్చిన మరో విషయం. మరి ఈ వృద్ధుడు ఇంట్లో పడుకుంటేనే ఎక్కువ కలలు కనగలడు కదా!