చంద్రబాబునాయుడి రాఖీ మహత్యం గురించి సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది. చంద్రబాబునాయుడి మైండ్ పోయిందని చెప్పేందుకు ఇటీవల బహిరంగ సభలో రాఖీ మహత్యం గురించి ఆయన చెప్పిన విషయాలను తీసుకుని వెటకరిస్తున్నారు. తాజాగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తనదైన వ్యంగ్య ధోరణిలో ట్విటర్ వేదికగా చాకిరేవు పెట్టారు.
విజయసాయిరెడ్డి ట్వీట్ ఏంటంటే.. “చంద్రబాబు గారు ఇచ్చే రాఖీ కట్టుకుంటే ఇంటర్ బైపీసీ చదివి ఇంజనీర్ కావచ్చు. పోలీస్ అయ్యి వర్క్ ఫ్రమ్ హోమ్ చేయొచ్చు. ఆస్కార్ నామినేషన్స్ కి వెళ్తే నోబెల్ ప్రైజ్ రావచ్చు, స్వాతంత్ర్య ఉద్యమంలోనూ పాల్గొనవచ్చు. అది నేనే కట్టా, ఇది నేనే పెట్టా అని మాట్లాడొచ్చు”
చాలా చక్కగా, చంద్రబాబును గారు అని సంబోధిస్తూ విజయసాయిరెడ్డి ఓ రేంజ్లో బండకేసి బాదారు. అసలు ఈ సృష్టికర్తను నేనే అని చంద్రబాబు చెప్పడం ఒక్కటే తరువాయి. ఎక్కడే మంచి జరిగినా దానికి ఆద్యుడిని తానే అని చెప్పుకోవడం చంద్రబాబు నైజం. మహిళలకు రాఖీ ఇస్తానని, దాన్ని 45 రోజుల పాటు పూజించి, చేతికి కట్టుకుని, కష్ట సమయంలో తనను తలచుకుంటే భగవత్ సంకల్పానికి తోడుంటానని చంద్రబాబు చెప్పారంటే, తనను తాను దైవంగా భావించుకుంటున్నారని అర్థం చేసుకోవచ్చు.
మానసిక స్థితి బాగా ఉన్న వాళ్లెవరూ ఇలా చెప్పరనే కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు విపరీత ధోరణికి ఇది పరాకాష్టగా చెబుతున్నారు. ఇంటర్లో బైపీసీ చదివితే ఇంజనీర్ కావచ్చని బాబు అనడంతో ఆయనేం మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి. సెల్ఫోన్ లైట్లను వెలిగించి, దాన్ని చూపుతూ ఈ సాంకేతికత ఘనత తన సొంతమని బాబు ప్రచారం చేసుకోవడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. బాబు విపరీత వ్యాఖ్యలు టీడీపీకి రాజకీయంగా లాభం తీసుకురావడం అటుంచి, భారీ నష్టం తప్పదనే ఆందోళన వ్యక్తమవుతోంది.