సంక్రాంతి బరిలో పించ్ హిట్టర్

సంక్రాంతి బరిలో చిరంజీవి, బాలకృష్ణ లాంటి ఇద్దరు పెద్ద హీరోలు తలపడుతున్నారు. మరోవైపు విజయ్, అజిత్ సినిమాలు కూడా రేసులో ఉన్నాయి. ఓవైపు ఇంత పోటీ నడుస్తున్నప్పకీ, మరోవైపు ఓ చిన్న సినిమా సంక్రాంతి…

సంక్రాంతి బరిలో చిరంజీవి, బాలకృష్ణ లాంటి ఇద్దరు పెద్ద హీరోలు తలపడుతున్నారు. మరోవైపు విజయ్, అజిత్ సినిమాలు కూడా రేసులో ఉన్నాయి. ఓవైపు ఇంత పోటీ నడుస్తున్నప్పకీ, మరోవైపు ఓ చిన్న సినిమా సంక్రాంతి బరిలోకి వస్తుందనే ఊహాగానాలు కొన్నాళ్లుగా వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడదే నిజమైంది. సంక్రాంతికి ఓ చిన్న సినిమా రెడీ అయింది.

సంతోష్ శోభన్ హీరోగా నటించిన కల్యాణం కమనీయం సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేయబోతున్నారు. పెళ్లి బ్యాక్ డ్రాప్ తో ఆహ్లాదకరమైన కథతో ఈ సినిమా తెరకెక్కింది. పేరుకు ఇది చిన్న సినిమానే అయినప్పటికీ, యూవీ క్రియేషన్స్ లాంటి పెద్ద బ్యానర్ బ్యాకప్ తో వస్తోంది. కాబట్టి ఈ మూవీకంటూ కొన్ని మంచి థియేటర్లు దక్కడం ఖాయం.

అనీల్ కుమార్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. పలు డబ్బింగ్ సినిమాలతో ఆకట్టుకున్న ప్రియాభవానీ శంకర్, ఈ సినిమాతో నేరుగా టాలీవుడ్ లోకి ఎంటర్ అవుతోంది. శ్రావణ్ భరధ్వాజ్ సంగీతం అందించాడు.

సంక్రాంతి బరిలో ఇలా ఉన్నఫలంగా ఓ చిన్న సినిమా ఊడిపడడం కొత్తేం కాదు. ఇంకా చెప్పాలంటే ఇది కూడా ఓ సంప్రదాయంగా కొనసాగుతూ వస్తోంది. సంక్రాంతికి డబ్బింగ్ సినిమాలు ఎంత కామనో, చిన్న సినిమాలు కూడా అంతే కామన్ గా వస్తున్నాయి. గతంలో అల్లుడు అదుర్స్, ఎంత మంచివాడవురా, రంగులరాట్నం, శతమానం భవతి, ఎక్స్ ప్రెస్ రాజా లాంటి సినిమాలు ఇలా సంక్రాంతికే వచ్చాయి. వీటిలో కొన్ని సూపర్ హిట్ అయిన సందర్భాలూ ఉన్నాయి.