Advertisement

Advertisement


Home > Movies - Movie News

నాగచైతన్యను మరోసారి లైక్ చేసిన హీరోయిన్

నాగచైతన్యను మరోసారి లైక్ చేసిన హీరోయిన్

నాగచైతన్య, హీరోయిన్ శోభిత ధూలిపాళ మధ్య ఏదో నడుస్తోందనే పుకార్లు ఇప్పటివి కాదు. ఎప్పటికప్పుడు వీళ్ల రిలేషన్ షిప్ పై, సింగిల్ స్టేటస్ పై ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. వాటిని ఎప్పటికప్పుడు ఈ జంట ఖండిస్తూనే ఉంది.

అయితే పుకార్లు వస్తున్నాయని తమ స్నేహాన్ని వీళ్లు వీడలేదు. ఎప్పటికప్పుడు ఒకరిపై ఒకరు ఇష్టాన్ని చూపించుకుంటూనే ఉన్నారు. తాజాగా నాగచైతన్య తన ఎకౌంట్ లో ఓ ఫొటో పెట్టాడు. అది ఫొటోషూట్ కాదు. చాలా సాధారణమైన పిక్.

సూర్యాస్తమయాన్ని ఎంజాయ్ చేస్తున్న ఆ ఫొటోను ఇలా పోస్ట్ చేయగానే అలా లైక్ చేసింది శోభిత. ఈ ఫొటో చూసిన చాలామంది, చైతూ పక్కన శోభిత ఉండి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. దీనికి కారణం గతంలో జరిగిన ఘటన.

లండన్ లో నాగచైతన్య, ఓ చెఫ్ కోరిక మేరకు అతడితో ఫొటో దిగాడు. ఆ ఫొటో బ్యాక్ గ్రౌండ్ లో శోభిత కనిపించింది. అప్పట్నుంచి వీళ్లిద్దరి రిలేషన్ షిప్ పై కథనాలు మొదలయ్యాయి. ఈసారి కూడా నాగచైతన్య పోస్టు చేసిన ఫొటో అలాంటిదే అయి ఉంటుందంటూ చాలామంది పోస్టులు పెడుతున్నారు.

సమంతతో విడిపోయిన తర్వాత సింగిల్ గా ఉంటున్నాడు నాగచైతన్య. అటు సమంత కూడా ప్రస్తుతానికి సింగిల్ గానే ఉంది. నాగచైతన్య తండేల్ సినిమా చేస్తున్నాడు. సమంత తన కొత్త సినిమా ప్రకటించడానికి రెడీ అవుతోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?