ఈ హీరోకు మళ్లీ ఫ్లాపుల పరంపర మొదలైందా?

తనకు హిట్స్, ఫ్లాప్స్ తో సంబంధం లేదని, ప్రతి సినిమాకు ఒకేలా పనిచేస్తానంటూ దాదాపు హీరోలంతా స్టేట్ మెంట్స్ ఇస్తుంటారు. కానీ ఈ స్టేట్ మెంట్ ను తూచ తప్పకుండా ఫాలో అయ్యే హీరో…

తనకు హిట్స్, ఫ్లాప్స్ తో సంబంధం లేదని, ప్రతి సినిమాకు ఒకేలా పనిచేస్తానంటూ దాదాపు హీరోలంతా స్టేట్ మెంట్స్ ఇస్తుంటారు. కానీ ఈ స్టేట్ మెంట్ ను తూచ తప్పకుండా ఫాలో అయ్యే హీరో మాత్రం రవితేజ. తనకు హిట్ వచ్చిందా, ఫ్లాప్ వచ్చిందా అనే విషయాన్ని ఈ హీరో అస్సలు పట్టించుకోడు. 

రవితేజకు అప్పుడప్పుడు హిట్స్ వస్తుంటాయి, చాలాసార్లు ఫ్లాపులు వస్తుంటాయి. అయితే ఈమధ్య కాలంలో అతడు వరుసపెట్టి హిట్స్ ఇచ్చాడు. ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాలు హిట్ అయ్యాయి. దీంతో రావణాసుర సినిమా కూడా హిట్ అవుతుందని, హ్యాట్రిక్ కొట్టేస్తామంటూ మేకర్స్ చెప్పుకొచ్చారు. 

'హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్' అంటూ మేకర్స్ పోస్టర్లు వేసుకున్నారు కానీ సినిమా మాత్రం ఫ్లాప్ అయింది. రిలీజైన తర్వాత మొదటి సోమవారం ఏ సినిమా రిజల్ట్ అయినా తేలిపోతుంది. రావణాసుర సినిమా రిజల్ట్ కూడా నిన్నటి సోమవారంతో తేలిపోయింది. ఏ ఏరియాలో చెప్పుకోదగ్గ స్థాయిలో షేర్లు రాలేదు. ట్రేడ్ మాటల్లో చెప్పాలంటే, మూవీ ఫ్లాట్ అయింది.

ఓ హిట్.. వరుస ఫ్లాపులు.. ఇదే ట్రాక్ రికార్డ్..

ఈ సినిమాతో రవితేజకు మరోసారి ఫ్లాపుల పరంపర మొదలైందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్స్ పడుతున్నాయి. ఎందుకంటే, ఈ హీరో ట్రాక్ రికార్డ్ అలాంటిది. క్రాక్ లాంటి సక్సెస్ తర్వాత వరుసగా 2 ఫ్లాప్స్ ఇచ్చాడు. అంతకంటే ముందు రాజా ది గ్రేట్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వరుసపెట్టి 4 ఫ్లాపులు ఇచ్చాడు. ఇంకాస్త వెనక్కు వెళ్తే, ఓ సక్సెస్ తర్వాత వరుసగా అరడజను ఫ్లాపులిచ్చిన ట్రాక్ రికార్డ్ కూడా ఉంది రవితేజకు. 

ఆ లెక్కన చూసుకుంటే.. రావణాసుర నుంచి మరోసారి రవితేజకు ఫ్లాపుల పరంపర మొదలయ్యేలా ఉందంటూ సోషల్ మీడియాలో నెగెటివ్ సెంటిమెంట్ ను ఎగదోస్తున్నారు కొంతమంది. త్వరలోనే రవితేజ నుంచి టైగర్ నాగేశ్వరరావు, ఈగల్ సినిమాలు రాబోతున్నాయి. వీటిలో ఏ సినిమా హిట్టయినా, రవితేజపై ఉన్న నెగెటివ్ సెంటిమెంట్ కు చెక్ పెట్టినట్టవుతుంది.