స్టీల్ ప్లాంట్ కి సింగరేణి డైరెక్టర్లు

విశాఖ స్టీల్ ప్లాంట్ సాగర తీరాన ఉంది. తెలంగాణలో సింగరేణి కాలరీస్ ఉన్నాయి. ఒకరు ఉక్కు తయారు చేస్తారు, మరొకరు బొగ్గు ఉత్పత్తి చేస్తారు. ఈ రెండింటికీ అసలు సంబంధం లేదు. ఎలా కలిశారు…

విశాఖ స్టీల్ ప్లాంట్ సాగర తీరాన ఉంది. తెలంగాణలో సింగరేణి కాలరీస్ ఉన్నాయి. ఒకరు ఉక్కు తయారు చేస్తారు, మరొకరు బొగ్గు ఉత్పత్తి చేస్తారు. ఈ రెండింటికీ అసలు సంబంధం లేదు. ఎలా కలిశారు అనుకుంటే కలిపింది మోడీ అని అంటున్నారు.

స్టీల్ ప్లాంట్ లో జాయింట్ వెంచర్ కింద ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద సాధ్యాసాధ్యాలను ముగ్గురు డైరెక్టర్ల బృందం పరిశీలిస్తుంది అని తెలుస్తోంది. మూల ధన సేకరణలో భాగంగా స్టీల్ ప్లాంట్ ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు స్టీల్ ప్లాంట్ యాజమాన్యం నిర్వహిస్తున్న ప్రతిపాదనల బిడ్డింగ్ కి ఈ నెల 15లోగా తన అనుమతిని ఎవరైనా తెలపాల్సి ఉంటుంది.

దీనికి సంబంధించి విధివిధాలాను సాధ్యాసాధ్యాలు తెలుసుకోవడానికే సింగరేణి నుంచి ముగ్గురు డైరెక్టర్ల బృందం వచ్చినట్లుగా తెలుస్తోంది. స్టీల్ ప్లాంట్ కి ఎంత నిధులు అవసరం అన్నది చూడాల్సి ఉంది. అదే విధంగా స్టీల్ ప్లాంట్ కి నిధుల సమకూర్చిత తరువాత వారు అందినే ఉత్పత్తులు ఏంటి అన్నది పరిశీలించాల్సి ఉంది.

ఈ జాయింట్ వెంచర్ ఒప్పందం ఎలా సాగుతుంది వాటి సాధ్యాసాధ్యాలు కూడా చూడాల్సి ఉంది. సింగరేణికి చెందిన డైరెక్టర్ల బృందం స్టీల్ ప్లాంట్ కి చెందిన మార్కెటింగ్ శాఖకు చెందిన ఉన్నతాధికారులతో భేటీ అయినట్లుగా చెబుతున్నారు. స్టీల్ ప్లాంట్ సీఎండీ ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఆయనతో మాట్లాడుతారా లేక స్టీల్ ప్లాంట్ వ్యవహారాలు పరిశీలించి వెళ్లిపోతారా అన్నది చూడాలి.  

స్టీల్ ప్లాంట్ మొత్తాన్ని టేకోవర్ చేయడానికి బిడ్డింగ్ అని జరుగుతున్న ప్రచారం తప్పు అని స్టీల్ ప్లాంట్ అధికారవర్గాలు చెబుతున్నాయి. స్టీల్ ప్లాంట్ లో కొంత సహాయకారిగా ఉండేందుకు మాత్రమే ఈ టెండర్లను పిలవడం అని అంటున్నారు. దీన్ని ఏకంగా స్టీల్ ప్లాంట్ నే కొనేస్తున్నారు అని ఎవరు బిల్డప్ ఇచ్చినా అది వట్టి మాటేనని అంటున్నారు. సింగరేణి డైరెక్టర్లు ఈ పర్యటన తరువాత తీసుకునే నిర్ణయం మీదనే తెలంగాణ ప్రభుత్వం తరువాత అడుగులు ఉంటాయని అంటున్నారు.