
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు లోకేశ్‌కు మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి తనయుడు, యువ నాయకుడు జేసీ పవన్‌కుమార్ రెడ్డి చివరి హెచ్చరిక చేశారు. అది మాటల ద్వారా కాకుండా చేతలతో అని చెప్పొచ్చు. తమ అడ్డాలో లోకేశ్ పాదయాత్ర ప్రవేశించినా జేసీ పవన్ కనీసం ఆ దరిదాపుల్లోకి కూడా వెళ్లకపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. గత సార్వత్రి ఎన్నికల్లో అనంతపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి జేసీ పవన్ పోటీ చేసి ఓడిపోయారు.
అప్పటి నుంచి అడపాదడపా టీడీపీ కార్యకలాపాల్లో జేసీ పవన్ పాల్గొనేవారు. ఆ తర్వాత నెమ్మదిగా అది కూడా మానేశారు. అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జేసీ పవన్ పోటీ చేయాలనే పట్టుదలతో ఉన్నారు. అయితే ఇప్పటికే అక్కడ టీడీపీకి ప్రభాకర్‌చౌదరి రూపంలో బలమైన అభ్యర్థి ఉన్నారు. జేసీ కుటుంబానికి, ప్రభాకర్ చౌదరికి మధ్య పచ్చగడ్డ వేస్తే భగ్గుమనే పరిస్థితి. జేసీ కుటుంబాన్ని అనంతపురంలో ఎట్టి పరిస్థితుల్లో అడుగు పెట్టనివ్వనని గతంలో పలుమార్లు ప్రభాకర్ చౌదరి బహిరంగంగానే హెచ్చరించిన సంగతి తెలిసిందే.
గత సార్వత్రిక ఎన్నికల్లో జేసీ పవన్ అనంతరం లోక్‌సభ, జేసీ ప్రభాకర్‌రెడ్డి తనయుడు జేసీ అస్మిత్‌రెడ్డి తాడిపత్రి అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేసి భంగపాటుకు గురయ్యారు. అయితే జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్ మాత్రం రాజకీయంగా యాక్టీవ్‌గా ఉన్నారు. అనంతపురం అసెంబ్లీ సీటు నుంచి పోటీ చేయాలన్న తన మనసులో మాటను చంద్రబాబు, లోకేశ్ వద్ద పవన్ బయట పెట్టారు. ఇందుకు వారు సమ్మతించలేదని విశ్వసనీయ సమాచారం.
దీంతో టీడీపీపై జేసీ పవన్ గుర్రుగా ఉన్నారు. చిత్తూరులో లోకేశ్ పాదయాత్ర మొదలు పెట్టినా జేసీ పవన్ మాత్రం కలవలేదు. కనీసం తన సొంత జిల్లా అనంతపురంలో లోకేశ్ పాదయాత్ర సాగుతున్నా జేసీ పవన్ మాత్రం దూరంగా ఉండడం గమనార్హం. ఇటీవల లోకేశ్‌ను జేసీ దివాకర్‌రెడ్డి కలిసిన సంగతి తెలిసిందే. తాజాగా లోకేశ్ పాదయాత్ర ఇవాళ 67వ రోజుకు చేరింది. శింగనమల నియోజక వర్గంలో పాదయాత్ర పూర్తి చేసుకుని తాడపత్రి నియోజక వర్గంలో ప్రవేశించింది.
లోకేశ్‌కు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డి తదితరులు ఘన స్వాగతం పలికారు. కానీ జేసీ దివాకర్‌రెడ్డి, ఆయన తనయుడు పవన్ కనిపించకపోవడం టీడీపీలో చర్చనీయాంశమైంది. తాడిపత్రి నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్రకు స్వాగతం పలుకుతూ కనీసం ఒక్క ప్లెక్సీని కూడా జేసీ పవన్ పేరుతో కట్టలేదంటే, ఆయన ఎంతగా రగిలిపోతున్నారో అర్థం చేసుకోవచ్చు.
అనంతపురం అసెంబ్లీ సీటు ఇవ్వకపోతే టీడీపీకి దూరమవుతామనే వార్నింగ్ జేసీ పవన్ ఇచ్చారనే చర్చకు తెరలేచింది. జేసీ దివాకర్‌రెడ్డి తనయుడి ఆగ్రహం... చివరికి ఉమ్మడి అనంతపురం జిల్లా రాజకీయాల్లో ఎలాంటి రాజకీయ మార్పు తీసుకురానందో చూడాలి.
నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా