తెరపైకి మరో సోషియో ఫాంటసీ

టాలీవుడ్ మెల్లగా సోషియో ఫాంటసీల వైపు మళ్లుతున్నట్టు కనిపిస్తోంది. బింబిసార, విశ్వంభర నుంచి మొదలుపెడితే ఈమధ్య కాలంలో చాలా సినిమాలు సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ తో వస్తున్నాయి. ఇప్పుడీ లిస్ట్ లోకి రాజ్ తరుణ్…

టాలీవుడ్ మెల్లగా సోషియో ఫాంటసీల వైపు మళ్లుతున్నట్టు కనిపిస్తోంది. బింబిసార, విశ్వంభర నుంచి మొదలుపెడితే ఈమధ్య కాలంలో చాలా సినిమాలు సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ తో వస్తున్నాయి. ఇప్పుడీ లిస్ట్ లోకి రాజ్ తరుణ్ కూడా చేరాడు.

కెరీర్ లో తొలిసారి ఓ సోషియో ఫాంటసీ సబ్జెక్ట్ చేస్తున్నాడు రాజ్ తరుణ్. ఇతడి గత సినిమాల బడ్జెట్స్ కంటే ఇది కాస్త ఎక్కువ బడ్జెట్ అవుతోంది. పైగా సీజీ వర్క్ కూడా ఉంది. వచ్చే ఏడాది ఈ సినిమా రిలీజ్ అవుతుందని రాజ్ తరుణ్ ప్రకటించాడు.

గ్రేట్ ఆంధ్రకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని బయటపెట్టాడు రాజ్ తరుణ్. త్వరలోనే భలే ఉన్నాడే సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు ఈ హీరో. అంతేకాదు, ఈ ఏడాది ఇంకో సినిమాను కూడా రిలీజ్ చేస్తానంటున్నాడు.

“ఓ క్రైమ్ కామెడీ సినిమా చేస్తున్నాను. దాదాపు పూర్తయింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ ఏడాదిలోనే రిలీజ్ అయిపోతుంది.” ఇదే కనుక జరిగితే ఈ ఏడాది రాజ్ తరుణ్ నుంచి 5 సినిమాలు వచ్చినట్టవుతుంది.

నా సామిరంగ సినిమాతో ఈ ఇయర్ ప్రారంభించాడు రాజ్ తరుణ్. ఆ తర్వాత పురుషోత్తమ్ముడు, తిరగబడరాసామీ సినిమాల్ని రిలీజ్ చేశాడు. మరికొన్ని రోజుల్లో భలే ఉన్నాడే సినిమా వస్తోంది. ఈ ఏడాదిలోనే క్రైమ్ కామెడీ కూడా రాబోతోంది. ఇవి కాకుండా ఓ వెబ్ సిరీస్ కూడా లైన్లో ఉంది.

3 Replies to “తెరపైకి మరో సోషియో ఫాంటసీ”

Comments are closed.