Advertisement

Advertisement


Home > Movies - Movie News

సాఫ్ట్ చోర్...శ్రీవిష్ణు

సాఫ్ట్ చోర్...శ్రీవిష్ణు

ఎంచి ఎంచి తనకు పక్కాగా సూటయ్యే పాత్రలు ఎంచుకుని సినిమాలు చేస్తూ వస్తున్నాడు హీరో శ్రీవిష్ణు. లేటెస్ట్ గా అతగాడు చేస్తున్న సినిమా రాజ రాజ చోర. ఈ సినిమా టీజర్ ను విడుదల చేసారు. మరీ కొత్త క్యారెక్టరైజేషన్ ఏమీ కాదు. 

బయటకు సాఫ్ట్ (వేర్) గా కనిపిస్తూ దొంగతనాలు అసలు వృత్తిగా పెట్టుకున్న హీరో. అయితే ఈ క్యారెక్టర్ కు శ్రీవిష్ణు ఇన్నోసెంట్ ఫేస్ యాడెడ్ అడ్వాంటేజ్ అయింది.

కథ లైన్ కూడా పెద్దగా క్లిష్టంగా వున్నట్లు లేదు. అనగనగా మారు వేషం వేసుకున్న దొంగ. అక్కడే పక్కా విలన్ లాంటి పోలీస్ ఆఫీసర్. వీళ్లద్దరి మధ్య జరిగిన దాగుడుమూతల ఆట. మధ్యలో హీరోయిన్ ఎలాగూ వుంటుంది. క్యూట్...హ్యాట్..మేఘా ఆకాష్.

పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ కలిసి నిర్మించే ఈ సినిమాకు వివేక్ కూచిభొట్ల నిర్మాణ నిర్వాహకుడు. జూలైలోనే ఈ సినిమా తెరమీదకు రానుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?