సినిమా కథ కావాలి అంటే పాయింట్ కావాలి అన్నది ఒకప్పటి మాట. ఏదో ఒక కాన్సెప్ట్ అనుకుంటే చాలు కథ అల్లేయచ్చు అనేది ఇప్పటి థియరీ.
సాఫ్ట్ వేర్ అబ్బాయి పోయి పోయి మార్కెట్ లో కూరగాయలు అమ్ముకునే అమ్మాయిని ప్రేమిస్తే.. ఇదీ కాన్సెప్ట్. ఇక చాలు.. పిల్లాడి పెళ్లి మీద ‘కోట్ల’ఆశలు పెట్టుకున్న తండ్రి, మార్కెట్ లో కూరగాయలు ఓ అందమైన అమ్మాయి విక్రయిస్తుంటే వచ్చే సమస్యలు, ఆ అమ్మాయి వీలయినంత రఫ్ గా, ఆ అబ్బాయి వీలయినంత సాఫ్ట్ గా.. ఇలా అల్లుకుంటూ వెళ్లిపోవడమే.
లేటెస్ట్ గా విడుదలైన ‘మార్కెట్ మహాలక్ష్మి’ అనే సినిమా ట్రయిలర్ చూస్తుంటేనే కథ చెప్పేసేలా వుంది. ఇంట్రస్టింగ్ పాయింట్… ఇన్నోసెంట్ బాయ్…రౌడీలను సైతం ఇరగదీసే అమ్మడు.. ఇక కొడుకు పెళ్లి కోసం కిందా మీదా అయిపోయే తండ్రి..ఇలా మొత్తం సెటప్ బాగానే రెడీ చేసారు. పార్వతీశం హీరోగా, ప్రణీకాన్విక హీరోయిన్ గా నిర్మిస్తున్న సినిమా మార్కెట్ మహాలక్ష్మి. అఖిలేష్ నిర్మాత. ముఖేష్ దర్ళకుడు. ప్యాడింగ్ ఆర్టిస్ట్ లు చాలా మందే వున్నారు.
మాటు, ప్రవర్తన మోటుగా వుంటే సరిపోదు, క్యారెక్టర్ మొత్తం అలాగే డిజైన్ చేయాలనుకున్నారేమో, కాస్త బొద్దుగా వున్న హీరోయిన్ ను తీసుకున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ అనే పాపులర్ పదాన్ని వర్క్ ఫ్రమ్ మార్కెట్ అని రీడిఫైన్ చేసారు. మార్కెట్ మహాలక్ష్మితో మజాక్ లాడితే మంచిగుండదు అనే లైన్ ఒకటి కాయిన్ చేసారు. కాన్సెప్ట్ ఓకె. ఎంటర్ టైన్ మెంట్ ఏ మేరకు పండించగలిగారు అన్నదాన్ని బట్టి సినిమా రిజల్ట్ వుంటుంది.