Advertisement

Advertisement


Home > Movies - Movie News

సొమవారం నుంచి మళ్లీ షూటింగ్ లు ?

సొమవారం నుంచి మళ్లీ షూటింగ్ లు ?

టాలీవుడ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ అంటూ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కు పోటీగా ఓ సంఘాన్ని స్టార్ట్ చేసారు నిర్మాత దిల్ రాజు. రెండు డజన్లకు పైగా సభ్యులతో బాగానే సాగుతోంది ఆ సంఘం. అయితే ఇప్పుడు ఏకంగా నిర్మాణాల బంద్ కు పిలుపు ఇవ్వడం అన్నది వివాదాస్పదంగా మారుతోంది. 

మామూలుగా అయితే వివాదం కాకపోను, దిల్ రాజు తాను నిర్మిస్తున్న, తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి, తెలుగు టెక్నీషియన్లు, తెలుగు నటులతో కూడిన తమిళ హీరో విజయ్ సినిమా వారసుడు షూటింగ్ మాత్రం చేసుకుంటున్నారు. 

దిల్ రాజుకు మద్దతు పలుకుతున్న మరో నిర్మాత నాగవంశీ కూడా ఇదే బాటలో ముందుకు వెళ్లి తెలుగు టెక్నీషియన్లు, తెలుగు దర్శకుడు, తెలుగు నటులు పని చేస్తున్న తమిళ హీరో ధనుష్ సినిమా సర్ షూటింగ్ కూడా కొనసాగిస్తున్నారు.

ఇప్పుడు ఇదే వివాదానికి, గిల్డ్ సభ్యుల్లో అసంతృప్తికి దారి తీసింది. తాము మాత్రం షూటింగ్ లు ఆపి, వడ్డీలు కట్టుకోవాలా అని పలువురు నిర్మాతలు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయాన్ని కొందరు నిర్మాతలు గిల్డ్ మీటింగ్ ల్లోనే నిలదీసినట్లు తెలుస్తోంది. 

ఇక తాము ఆగదేది లేదని సోమవారం నుంచి షూటింగ్ లు జరుపుకుంటామని కొందరు నిర్మాతలు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఇలా సోమవారం నుంచి ప్రారంభం కానున్న సినిమాల్లో నాని హీరోగా తయారవుతున్న ‘దసరా’ సినిమా కూడా వున్నట్లు తెలుస్తోంది.

సినిమా షూటింగ్ ఆపి తన నిర్మాతకు నష్టం కలగనివ్వనని హీరో నాని తనను కలిసిన గిల్డ్ ప్రతినిధులకు స్ఫష్టం చేసినట్లు తెలుస్తోంది. అభిషేక్ నామా కూడా సినిమా చేయాలని అనుకున్నారు. కానీ గిల్డ్ సభ్యులు బుజ్జగించినట్లు తెలుస్తోంది. 

అన్నపూర్ణలో వేసిన సెట్ షూటింగ్ చేయకుండా అలా వుండిపోవడం వల్ల స్టూడియో నుంచి చార్జీలు పడకుండా చూస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. గిల్డ్ యాక్టివ్ సభ్యురాలు సుప్రియ తో మాట్లాడి స్టూడియో ద్వారా కొన్ని ఖర్చులు తగ్గించేలా చేస్తామని చెప్పినట్లు తెలుస్తోంది.

మొత్తానికి చూస్తుంటే గిల్డ్ బంద్ విషయంలో టాలీవుడ్ రెండుగా చీలుతున్నట్లు కనిపిస్తోంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?