‘విడాకులు’పై బాలీవుడ్ హీరోయిన్ ఫైర్‌

రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌(ఆరెస్సెస్‌) చీఫ్‌ మోహన్‌ భగవత్  మాట‌ల‌పై బాలీవుడ్ హీరోయిన్ సోనం క‌పూర్ ఫైర్ అయ్యారు. విద్యావంతులే విడాకులు తీసుకుంటున్నార‌నే భ‌గ‌వ‌త్ మాట‌లు…ఆమె ఆగ్ర‌హానికి కార‌ణ‌మ‌య్యాయి. పెద్దాయ‌న అయిన మోహ‌న్ భ‌గ‌వ‌త్‌ను ఉద్దేశించి…

రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌(ఆరెస్సెస్‌) చీఫ్‌ మోహన్‌ భగవత్  మాట‌ల‌పై బాలీవుడ్ హీరోయిన్ సోనం క‌పూర్ ఫైర్ అయ్యారు. విద్యావంతులే విడాకులు తీసుకుంటున్నార‌నే భ‌గ‌వ‌త్ మాట‌లు…ఆమె ఆగ్ర‌హానికి కార‌ణ‌మ‌య్యాయి. పెద్దాయ‌న అయిన మోహ‌న్ భ‌గ‌వ‌త్‌ను ఉద్దేశించి ఇలాంటి తెలివి త‌క్కువ మాట‌లు ఎలా మాట్లాడ‌తారంటూ ఆమె మండిప‌డ్డారు.

అహ్మ‌దాబాద్‌లో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో మోహ‌న్ భ‌గ‌వ‌త్ మాట్లాడారు. విడాకుల కేసులు ఎక్కువ‌గా విద్యావంతులు, ధ‌న వంతుల కుటుంబాల్లోనే ఎక్కువ‌గా ఉంటున్నాయ‌న్నారు.  చిన్న చిన్న విషయాలకే కొట్లాడుకుంటూ విడిపోతున్నారని విమర్శించారు.

‘ప్ర‌స్తుత వ్య‌వ‌స్థ‌లో విడాకులు తీసుకునే వాళ్ల సంఖ్య  రోజురోజుకూ పెరిగిపోతోంది. ఎలాంటి కార‌ణాలు లేకుండానే, అర్థంపర్థంలేని వాటి కోసం విడాకుల దాకా వెళ్తున్నారు. ముఖ్యంగా బాగా చదువుకున్న వాళ్లు.. ఐశ్వర్యవంతులైన వారే విడాకులు తీసుకుంటున్నారు’ అని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

అంత‌టితో ఆయ‌న ఆగ‌లేదు. మ‌రింత ఘాటైన ప‌ద‌జాలాన్ని కూడా వాడారు.  

‘విద్య, డబ్బుతో పొగరుబట్టిన కారణంగా ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు. దాంతో కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. సమాజంలో కూడా అంతరాలు పెరిగిపోతున్నాయి’ అని మోహన్‌ భగవత్ విమ‌ర్శించారు.

మోహన్‌ భగవత్‌ వ్యాఖ్యలపై సోనం కపూర్‌ ట్విటర్‌ వేదికగా అంతే ఘాటుగా స్పందించారు.  

‘ఈ మనిషి.. అసలు ఇలా ఎలా మాట్లాడతారు? ఇవి పూర్తిగా తెలివితక్కువ, వెనుకబాటుతనాన్ని సూచించే మాటలు’ అంటూ ఫైర్‌ అయ్యారు. మొత్తానికి విడాకుల అంశం వివాదాస్ప‌ద‌మైంది.

త్రివిక్రమ్, ఎన్టీఆర్ ప్రాజెక్ట్ చాలా పెద్దది