లేదు లేదు లేదు…రేణు స్పంద‌నిదే!

ఏదో ఒక అంశాన్ని ముందుకు తీసుకు రావ‌డం, దాన్ని రేణుదేశాయ్‌కి ముడిపెట్ట‌డం, సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డం ఇటీవ‌ల కాస్త ఎక్కువైంది. ఎక్క‌డో పూణేలో త‌న మానాన తాను బ‌తుకుతూ, త‌న‌కిష్ట‌మైన డాక్యుమెంట‌రీస్ తీస్తూ,…

ఏదో ఒక అంశాన్ని ముందుకు తీసుకు రావ‌డం, దాన్ని రేణుదేశాయ్‌కి ముడిపెట్ట‌డం, సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డం ఇటీవ‌ల కాస్త ఎక్కువైంది. ఎక్క‌డో పూణేలో త‌న మానాన తాను బ‌తుకుతూ, త‌న‌కిష్ట‌మైన డాక్యుమెంట‌రీస్ తీస్తూ, సినిమా ఫంక్ష‌న్ల‌కు హాజ‌ర‌వుతూ పిల్ల‌ల‌తో గుట్టుచ‌ప్పుడు కాకుండా కాలం వెళ్ల‌దీస్తున్న రేణును గ‌త జీవితం విడిచిపెట్టేలా లేదు.

త‌న శ్ర‌మ‌తో సంపాదించిన నాలుగు డ‌బ్బుల‌తో హైద‌రాబాద్‌లో ప్లాట్ కొన్న రేణుకు ఓ చిన్న వార్త మ‌న‌శ్శాంతి లేకుండా చేసింది. ప‌వ‌న్ త‌న మాజీ భార్య రేణు, వారి పిల్ల‌లకు రూ.5 కోట్ల  విలాస వంత‌మైన ఇల్లు కొనిచ్చార‌ని పెద్ద ఎత్తున సోష‌ల్ మీడియాతో పాటు ఇత‌ర మాధ్య‌మాల్లో  ప్ర‌చార‌మైంది. చివ‌రికి దాన్ని రేణు ఖండించాల్సి వ‌చ్చింది.

అంతేకాదు. ఆమె ఒక బ‌హిరంగ లేఖ కూడా రాశారు. ఆ లేఖ‌లో హార్ట్ ట‌చింగ్ విష‌యాన్ని ప‌రిశీలిద్దాం. `నేనిప్ప‌టి వ‌ర‌కు క‌నీసం మా తండ్రి గారి ద‌గ్గ‌ర్నుంచి ఏ ర‌క‌మైన ఆర్థిక స‌హాయం ఆశించ‌లేదు, పొందలేదు. అలాగే నేనిప్ప‌టి వ‌ర‌కు నా మాజీ భ‌ర్త ద‌గ్గ‌ర్నుంచి కూడా ఎలాంటి అన్యాయ పూరిత‌మైన భ‌ర‌ణాన్ని ఆశించ‌లేదు. పొంద‌లేదు. అది నా వ్య‌క్తిత్వం` అని రాయ‌డం వెనుక ఆమె ప‌డిన ఆవేద‌న‌ను అర్థం చేసుకోవ‌చ్చు.

ఆ ప్ర‌చారం ముగిసిపోక ముందే మ‌రొక‌టి చ‌క్క‌ర్లు కొట్టింది. బాలీవుడ్‌లో విజ‌య‌వంత‌మైన   `పింక్` రీమేక్‌లో ప‌వ‌న్ రీ ఎంట్రీ చేసిన విష‌యం తెలిసిందే. ఈ సినిమాలో రేణుదేశాయ్ కూడా ఓ ముఖ్య‌పాత్ర పోషిస్తున్నార‌నే ప్ర‌చారం బాగా వైర‌ల్ అయ్యింది. ఆ విష‌య‌మై రేణును  `మీరు `పింక్` రీమేక్‌లో నటిస్తున్నారా?` అని ఓ నెటిజన్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా  ప్రశ్నించాడు.

రేణు స్పందిస్తూ `లేదు. అవన్నీ అసత్య కథనాలు` అంటూ జవాబిచ్చారు. కాగా రేణుకు ప‌వ‌న్ రూ.5 కోట్ల భ‌వ‌నాన్ని ప‌వ‌న్ కొనిచ్చార‌నే వార్త‌ను ఖండించిన త‌ర్వాత ఇది రెండోది. పాపం రేణు…ఏదో ర‌కంగా ప‌వ‌న్‌తో లింక్ పెట్టి ఓ వార్త రావ‌డం, దాన్ని ఆమె ఖండించ‌డం. మున్ముందు ఇంకా ఎన్నెన్ని ఖండించాల్సి ఉంటుందో మ‌రి!

ఏ జోనర్ చేసినా ఫ్లాపులు పలకరించాయి