శౌర్య సినిమా గ్రాస్ @ 3.60

మాంచి అంచనాల మధ్య విడుదయింది హీరో నాగశౌర్య హోమ్ ప్రొడక్షన్ అశ్వద్దామ. ఇండస్ట్రీలో చాలా మంది ఈ సినిమా విడుదలయిన తరువాత ఎలా వుంది? ఎలా వుంది?  అని ఎంక్వయిరీ చేసారు అంటే, ఆ…

మాంచి అంచనాల మధ్య విడుదయింది హీరో నాగశౌర్య హోమ్ ప్రొడక్షన్ అశ్వద్దామ. ఇండస్ట్రీలో చాలా మంది ఈ సినిమా విడుదలయిన తరువాత ఎలా వుంది? ఎలా వుంది?  అని ఎంక్వయిరీ చేసారు అంటే, ఆ సినిమా కు వచ్చిన బజ్ అర్థం అవుతుంది. అయితే ప్రతి సెంటర్ లో సరిలేరు, అల వైకుంఠపురములో ఇంకా మాంచి రన్ తీసుకుంటున్నాయి.  మెయిన్ థియేటర్లు అన్నీ వాటికే వుండిపోయాయి.  

ఈ నేపథ్యంలో విడుదలయిన అశ్వద్ధామ తొలి రోజు వరల్డ్ వైడ్ 3.60 కోట్లు గ్రాస్ వసూలు చేయడం అంటే కాస్త చెప్పుకోదగ్గ సంగతే. సినిమాను తెలుగు రాష్ట్రాల్లో జస్ట్ 7 కోట్ల మేరకు మార్కెట్ చేసారు. అందువల్ల సులువుగానే బ్రేక్ ఈవెన్ అయిపోతుంది అని భావిస్తున్నారు.శౌర్య సినిమాలకు తొలిరోజు వేసిన ప్రతి థియేటర్ లో యాభై శాతం ఓపెనింగ్స్ రావడం అంటే సినిమాకు చేసిన ప్రచారం మహిమే.

థ్రిల్లర్ గా రూపొందిన అశ్వద్ధామ లో మెహరీన్ హీరోయిన్ గా నటించింది. బెంగాలీ నటుడు విష్ణుసేన్ గుప్తా విలన్ గా నటించాడు.

ఈ రికార్డులు ఎవ‌రైనా బ్రేక్ చేస్తే చూడాల‌ని వుంది

మరో పెళ్లిచూపులు