జనాలకు చేరువ కావాలంటే పాదయాత్రనే అల్టిమేట్ అని వర్తమాన రాజకీయాల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రూవ్ చేసారు. తరువాత జగన్ దాన్నే కొనసాగించారు. ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా అదే బాట పడుతున్నారు. సరే ఇదంతా పొలిటికల్ వ్యవహారం.
సినిమా హీరోలు కూడా తమ తమ సినిమాలను జనాలకు చేరువ చేయడానికి కాలేజీ యాత్రలు చేయడం అన్నది కామన్ అయిపోయింది. కార్లో, బస్సులో పెట్టుకుని పెద్ద ఊర్లకు వెళ్లడం, అక్కడ కాలేజీ కుర్రాళ్లను కాస్సేపు ఎంటర్ టైన్ చేయడం అన్నది రెగ్యులర్ పబ్లిసిటీ ఫార్మాట్ అయిపోయింది.
హీరో నాగశౌర్య ఇప్పుడు ఈ పొలిటికల్ ఫార్మాట్ ను, సినిమా స్టయిల్ ను మిక్స్ చేసి కొత్త ఫార్ములా తయారు చేసాడు. ఈ నెల 23న విడుదల కాబోయే కృష్ణ వృింద విహారి సినిమా ప్రమోషన్ కోసం కాలేజీ టూర్ లు ప్లస్ పాదయాత్ర చేయబోతున్నాడు.
ఇదెలా అంటే…తిరుపతి నుంచి విశాఖ వరకు ఈ యాత్ర సాగుతుంది. వాహనాల్లో ఊళ్లోకి రాగానే కిందకు దిగి పాదయాత్ర ప్రారంభిస్తారు. కాలేజీ లేదా ఏదో ఒక వెన్యూ వరకు జనాలతో ఇంట్రాక్ట్ అవుతూ ఈ పాదయాత్ర నిర్వహిస్తారు. మళ్లీ మరో ఊరు చేరాక మళ్లీ మూమూలే.
దీనివల్ల కాస్త శ్రమ, బౌన్సర్ల వ్యయం, అనుమతులు ఇలా చాలా వుంటాయి. కానీ సినిమాను జనాలకు చేరువ చేయాలంటే ఏదో ఒకటి కొత్తగా ఆలోచించాలి కనుక ఈ రూట్ ను ఎందుకున్నాడు నాగశౌర్య. కృష్ణవృిందవిహారి సినిమాకు దర్శకుడు అనీష్ కృష్ణ. నిర్మాత ఉష మాల్పూరి.