ఎస్పీబీ మళ్లీ మరోసారి

ఎంత మంది కొత్త సింగర్లు వచ్చినా, ఎస్పీబీ స్వరం..అది వేరే. మనసుకు హాయిగా వుండే పాటలు, మాంచి మెలోడియస్ సాంగ్స్ పాడించాలంటే ఇటీవల మన మ్యూజిక్ డైరక్టర్లకు  ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గుర్తుకు వస్తున్నారు. శతమానం…

ఎంత మంది కొత్త సింగర్లు వచ్చినా, ఎస్పీబీ స్వరం..అది వేరే. మనసుకు హాయిగా వుండే పాటలు, మాంచి మెలోడియస్ సాంగ్స్ పాడించాలంటే ఇటీవల మన మ్యూజిక్ డైరక్టర్లకు  ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గుర్తుకు వస్తున్నారు. శతమానం భవతి, డిస్కోరాజా, పలాస ఇలా పలు సినిమాల్లో ఇటీవల మంచి మెలోడీలు ఎస్ఫీబీ స్వరంలో బయటకు వచ్చాయి.

లేటెస్ట్ గా మరోపాట వచ్చింది. కళ్యాణ్ రామ్-మెహరీన్ కాంబినేషన్ లో ఆదిత్య మ్యూజిక్ సంస్థ-శ్రీదేవీ మూవీస్ కృష్ణప్రసాద్ కలిసి నిర్మిస్తున్న 'ఎంత మంచివాడవురా' సినిమా నుంచి తొలి పాటను విడుదల చేసారు. శతమానం భవితలో మంచి పీరియాడిక్ మెలోడీి ఎస్పీబీ చేత పాడించిన దర్శకుడు సతీష్ వేగ్నిశ, ఈ సినిమాకు దర్శకుడు. ఆ సెంటిమెంట్ తోనో లేదా పాట అలాంటిది అనో మళ్లీ ఆయన చేతే పాడించారు.

రామజోగయ్య రాసిన పాటకు గోపీసందర్ స్వరాలు అందించారు. 'ఏమో..ఏమో..ఏ గుండెల్లో ఏ బాధ వుందో, ఓ కొంచెం పాలు పంచుకుందాం..ఏమో..ఏమో..ఏ దారుల్లో ఏ బంధముందో.. బంధువుల సంఖ్య పెంచుకుందాం..అంటూ సాగిన ఈ హాయైన గీతాన్ని బాలు తన స్టయిల్ లో మెలోడియస్ గా అందించారు. గోపీసుందర్ కూడా  ఏదో కొత్త ప్రయోగం అన్నట్లుగా చేయకుండా, అలవాటైన, వినాలనిపించే సున్నితమైన ట్యూన్ ను తీసుకుని పాటను చేసారు.

సంక్రాంతికి విడుదలయ్యే ఈ ఫీల్ గుడ్ మూవీలో తనికెళ్ల, నరేష్,శరత్ బాబు, సుహాసిని ఇంకా అనేక మంది సీనియర్ ఆర్టిస్ట్ లు నటించారు.