స్పై..స్పై..స్పై

టాలీవుడ్ సినిమాలు అన్నీ ఇప్పుడు పీరియాడిక్ స్పై కథల చుట్టూ తిరుగుతున్నాయి.  Advertisement ఏ కొరియన్ సీడీ అయినా అందరికీ ఒకటే దొరికిందో..లేక మరేం జరిగిందో, అందరికన్నా ముందుగా నిఖిల్ స్పై సినిమా మొదలైంది.…

టాలీవుడ్ సినిమాలు అన్నీ ఇప్పుడు పీరియాడిక్ స్పై కథల చుట్టూ తిరుగుతున్నాయి. 

ఏ కొరియన్ సీడీ అయినా అందరికీ ఒకటే దొరికిందో..లేక మరేం జరిగిందో, అందరికన్నా ముందుగా నిఖిల్ స్పై సినిమా మొదలైంది. పీరియాడిక్ సినిమా. సుభాష్ చంద్రబోస్ కనెక్షన్ వున్న కథ. 

తరువాత కళ్యాణ్ రామ్ డెవిల్ మొదలైంది. అది కూడా డిటో..డిటో..సుభాష్ చంద్రబోస్ కనెక్షన్ వున్న పీరియాడిక్ సినిమా. ఇప్పుడు లేటెస్ట్ గా విజయ్ దేవరకొండ-గొతమ్ తిన్ననూరి సినిమా అనౌన్స్ మెంట్ వచ్చింది. ఇది కూడా పీరియాడిక్ స్పై సినిమానే.

ఒకటే తేడా. మొదటి రెండు సినిమాలో ఓ మోస్తరు బడ్జెట్ తో, ఓ రేంజ్ లో తీస్తున్నారు. కానీ విజయ్ సినిమా కాస్త భారీ బడ్జెట్ తో తీస్తారు. 

గౌతమ్ తిన్ననూరి దర్శకుడు కాబట్టి భావోద్వేగాలు మరి కాస్త బలంగా వుండొచ్చు. విజయ్ సినిమాలో మిలటరీ, యుద్ద టాంకులు, భారీ హంగామా వుంటుందని తెలుస్తోంది. అనిరుధ్ సంగీతం కనుక సీన్లు ఓ రేంజ్ లో పండొచ్చు.

గూఢచారి సినిమా పెద్ద హిట్. దీని తరువాత అడవి శేష్ గూఢచారి 2 చేస్తున్నారు. అది మొదలు కావాల్సి వుంది. ఎటొచ్చీ అది మోడరన్ స్పై సినిమా. 

ఇవి పీరియాడిక్ స్పై సినిమాలు. రాజమౌళి కూడా మహేష్ బాబుతో బాండ్ సినిమా తీస్తారని టాక్. బాండ్ సినిమా అది కూడా స్పై సినిమానే కదా. ఇంకెన్ని వస్తాయో ఈ బాటలో.