శ్రీలీల.. కుర్రకారు గుండెకు గాలం. పెళ్లిసందడి నుంచి గుంటూరు కారం వరకు, సినిమాలు హిట్ అయినా కాకున్నా, ఆమె అందాలకు మాత్రం తేడా లేదు. గుంటూరు కారం సినిమాలో కుర్చీని మడతపెట్టి సాంగ్ ఇచ్చిన కిక్, ఆ సినిమా బాక్సాఫీస్ సక్సెస్ కు చాలా అంటే చాలా హెల్ప్ చేసింది.
రవితేజకు అటు ఇటు అరడజను సినిమాల లెక్కలో ధమాకా ఓన్లీ సక్సెస్ గా నిలవడానికి కారణం శ్రీలీల డ్యాన్స్ లు అంటే కాదనేవారు వుండరు. కానీ వరుస ఫ్లాపుల వల్ల శ్రీలీల కాస్త వెనుకపడింది. అప్పటి వరకు పగలు, రాత్రి అని తేడా లేకుండా, ఆమె ఎప్పుడు టైమ్ ఇస్తే అప్పుడు షూటింగ్ లు పెట్టుకునే పరిస్థితి.
కట్ చేస్తే… సితారలో విజయ్ దేవరకొండ సినిమా చేయాల్సి వుంది శ్రీలీల. కానీ ఆ చాన్స్ ఎందుకో మారింది. దానికి బదులుగా అన్నట్లు అదే బ్యానర్ లో రవితేజ సరసన మరోసారి హీరోయిన్ గా ఓకె అయింది. సినిమా నిన్నటికి నిన్న స్టార్ట్ అయింది. ఈ సినిమా పూజ ఫొటోల్లో శ్రీలీల ను చూసిన వారు కాస్త అవాక్కయ్యారు. ఈ మధ్య వర్కవుట్ పూర్తిగా ఆపేసినట్లు కనిపించింది.
కాస్త బొద్దుగా, వళ్లు చేసినట్లు కనిపిస్తోంది. 22 ఏళ్ల వయసులో నిన్న మొన్నటి వరకు చిన్న పిల్లలా కనిపించిన శ్రీలీల ఈ పూజ ఫొటోల్లో మాత్రం కాస్త ఎక్కువ వయసున్నట్లు కనిపించింది. దీంతో సోషల్ మీడియాలో అక్కడక్కడ ఆంటీ అంటూ కామెంట్లు కనిపించేసాయి.
సినిమా నటులు లావు, సన్నం కావడం పెద్ద సమస్య కాదు. గట్టిగా నాలుగు రోజులు వర్కవుట్ చేస్తే మళ్లీ స్లిమ్ అయిపోతారు. కానీ అలా దృష్టి పెట్టాల్సి వుంది. అక్కడ మాత్రం తేడా రాకూడదు.