Advertisement

Advertisement


Home > Movies - Movie News

శ్రీజ అక్కౌంట్ పేరు మారిందా?

శ్రీజ అక్కౌంట్ పేరు మారిందా?

మెగాస్టార్ చిరు తనయ శ్రీజ. చాలా ఏళ్ల క్రితం వార్తల్లో హల్ చల్ చేసిన పేరు. ఆ తరువాత అంతా సద్దుమణిగింది. కళ్యాణ్ దేవ్ తో వివాహం జరిగింది. ఇద్దరూ బాగానే వున్నారు ఈడూ జోడూ అనుకున్నారంతా. కానీ ఇటీవలే మళ్లీ ఇద్దరి మధ్య పొసగడం లేదని గ్యాసిప్ లు అడపా దడపా గుప్పుమనడం ప్రారంభమైంది. 

ఈ మధ్యన కళ్యాణ్ దేవ్ నటించిన సూపర్ మచ్చి విడుదల అయింది. మెగాక్యాంప్ మొత్తం ఆ సినిమాకు దూరంగా వుంది. అంతే కాదు కళ్యాణ్ దేవ్ కూడా ఎక్కడా ఆ సినిమా ప్రమోషన్లలో కనిపించలేదు. 

అసలు కళ్యాణ్ ధేవ్ ఇండియాలో వున్నారో, అమెరికాలో వున్నారో కూడా తెలియరాలేదు. ఇటీవల మెగాస్టార్ ఇంట్లో జరిగిన సంక్రాంతి వేడుకల్లో కూడా కళ్యాణ్ ధేవ్ కనిపించలేదు.

ఇదిలా వుంటే శ్రీజ ఇన్ స్టా గ్రామ్ అక్కౌంట్ పేరు మార్చిందని ఇప్పుడు తెలుస్తోంది. నిన్నటి వరకు శ్రీజ కళ్యాణ్ అని వుండేదని, ఇప్పుడు లేటెస్ట్ గా శ్రీజ కొణిదెల అని మార్చినట్లు తెలుస్తోంది. 2020 ఏప్రిల్ తరువాత శ్రీజ అక్కౌంట్ లో ఒక్కటి కూడా కళ్యాణ్ ధేవ్ ఫొటో లేదు. మిగిలిన మెగా హీరోల ఫొటోలు అన్నీ దర్శనమిస్తున్నాయి. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?