వరుసగా ఫస్ట్ లుక్స్.. ఎక్కడ చూసినా శ్రీలీల

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా శ్రీలీలే కనిపిస్తోంది. ట్విట్టర్ లో ఆమె పేరు ట్రెండ్ అవుతోంది. టాలీవుడ్ శ్రీలల చుట్టూ తిరుగుతోంది. దీనికి కారణం ఈరోజు ఆమె పుట్టినరోజు కావడమే. ఈ సందర్భంగా…

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా శ్రీలీలే కనిపిస్తోంది. ట్విట్టర్ లో ఆమె పేరు ట్రెండ్ అవుతోంది. టాలీవుడ్ శ్రీలల చుట్టూ తిరుగుతోంది. దీనికి కారణం ఈరోజు ఆమె పుట్టినరోజు కావడమే. ఈ సందర్భంగా ఆమె నటిస్తున్న సినిమాల నుంచి వరుసపెట్టి ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేశారు మేకర్స్.

మహేష్ బాబు సరసన త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం అనే సినిమా చేస్తోంది శ్రీలీల. ఈ మూవీకి సంబంధించి మహేష్ లుక్ ఆల్రెడీ రిలీజైంది. తాజాగా శ్రీలీల ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. కాళ్లకు నెయిల్ పాలిష్ పెట్టుకుంటూ సంప్రదాయబద్ధంగా లంగాఓణి వేసుకున్న శ్రీలీల ఫొటోను విడుదల చేశారు. ఇందులో స్పష్టంగా త్రివిక్రమ్ మార్క్ కనిపిస్తోంది.

ఇక రామ్-బోయపాటి సినిమా నుంచి కూడా శ్రీలీల లుక్ రిలీజైంది. ఇందులో మోడ్రన్ గెటప్ లో, నోటిలో వేలు పెట్టుకొని, నాటీగా కనిపిస్తున్న శ్రీలల ఫొటోను విడుదల చేశారు. అటు భగవంత్ కేసరి నుంచి కూడా శ్రీలీల పోస్టర్ వచ్చింది. క్యూట్ స్మైల్ తో సింపుల్ గా ఉన్న ఫొటో ఇది.

నితిన్-వక్కంతం సినిమాలో కూడా శ్రీలల హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో శ్రీలల పాత్రను పరిచయం చేస్తూ, డేంజర్ పిల్ల అనే క్యాప్షన్ తగిలించారు. ఇక ఆదికేశవ సినిమా నుంచి ఎల్లో శారీలో ముద్దుగా కనిపించే లుక్ ను, ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి బుంగమూతి పెట్టి, చిరుకోపంతో చూస్తున్న లుక్ ను విడుదల చేశారు.

ఆహా కోసం బన్నీతో కలిసి ఓ ప్రాజెక్టు చేస్తోంది శ్రీలీల. దీనికి సంబంధించి కూడా ఓ లుక్ రిలీజైంది. ఇలా ఈరోజు పొద్దున్నుంచి శ్రీలీల సినిమాల ఫస్ట్ లుక్ పోస్టర్లతో ఇండస్ట్రీ మోతమోగిపోతోంది.

Click Here For Photo Gallery