అమిత్ షా ప‌ర్య‌ట‌న వాయిదా

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా తెలంగాణ ప‌ర్య‌ట‌న వాయిదా ప‌డింది. ఈ విష‌యాన్ని తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ తెలిపారు. బిప‌ర్‌జాయ్ తుపాన్ ఎఫెక్ట్‌తో ఆయ‌న తెలంగాణ‌కు రాకూడ‌ద‌ని నిర్ణ‌యించుకున్నార‌ని తెలిపారు. తుపాను…

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా తెలంగాణ ప‌ర్య‌ట‌న వాయిదా ప‌డింది. ఈ విష‌యాన్ని తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ తెలిపారు. బిప‌ర్‌జాయ్ తుపాన్ ఎఫెక్ట్‌తో ఆయ‌న తెలంగాణ‌కు రాకూడ‌ద‌ని నిర్ణ‌యించుకున్నార‌ని తెలిపారు. తుపాను ప్ర‌భావం గుజ‌రాత్‌పై ఎక్కువ‌గా ప‌డ‌నుంద‌ని, అక్క‌డి ప‌రిస్థితుల‌ను ప‌ర్య‌వేక్షించేందుకు అమిత్ షా వెళ్ల‌నున్న‌ట్టు స‌మాచారం.

ఈ నెల 15న ఖ‌మ్మంలో బీజేపీ నిర్వ‌హించ‌నున్న భారీ బ‌హిరంగ స‌భ‌కు అమిత్‌షా హాజ‌రు కావాల్సి వుంది. రెండు వారాలుగా అమిత్ షా ప‌ర్య‌ట‌న‌ను విజ‌య‌వంతం చేసేందుకు బీజేపీ నేత‌లు క్షేత్ర‌స్థాయిలో ప‌ని చేస్తున్న‌ట్టు బండి సంజ‌య్ తెలిపారు. 

అమిత్ షా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా హైద‌రాబాద్‌లో ప‌లువురు ప్ర‌ముఖుల్ని క‌ల‌వాల్సి వుండింది. అమిత్ షా ప‌ర్య‌ట‌న వాయిదాతో వారంతా నిరుత్సాహానికి గుర‌య్యారు. ఇదిలా వుండ‌గా ఖ‌మ్మంలో మ‌రో రోజు భారీ బ‌హిరంగ స‌భ నిర్వ‌హించ‌నున్న‌ట్టు బండి సంజ‌య్ తెలిపారు. 

తెలంగాణ‌కు మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్ర‌భుత్వం చేసిన సాయం గురించి చెప్ప‌డంతో పాటు రానున్న ఎన్నిక‌ల్లో ఆ రాష్ట్రంలో బీజేపీ ప్ర‌భుత్వం ఏర్పాటు చేయ‌డానికి అమిత్ షా దిశా నిర్దేశం చేయ‌నున్నార‌ని పార్టీ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. అమిత్ షా నేతృత్వంలో ప‌లువురు బీజేపీలో చేర‌నున్న‌ట్టు సంజ‌య్ వెల్ల‌డించారు.