హీరోయిన్ శ్రీలీల తండ్రి ఎవరు..?

పెళ్లి సందడి సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది శ్రీలీల. చేసిన మొదటి సినిమాకే గ్లామరస్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. సినిమాలో ఏం లేకపోయినా శ్రీలీల కోసం ఓసారి చూడొచ్చంటూ రివ్యూలు వచ్చాయంటే, ఆమె ఇంపాక్ట్…

పెళ్లి సందడి సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది శ్రీలీల. చేసిన మొదటి సినిమాకే గ్లామరస్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. సినిమాలో ఏం లేకపోయినా శ్రీలీల కోసం ఓసారి చూడొచ్చంటూ రివ్యూలు వచ్చాయంటే, ఆమె ఇంపాక్ట్ అర్థంచేసుకోవచ్చు. అయితే ఈ క్రేజ్ వచ్చిన కొన్ని గంటలకే, ఆమెను వివాదాలు కూడా చుట్టుముట్టాయి.

కొన్ని మీడియా సంస్థలు శ్రీలీల తండ్రి ఓ పెద్ద వ్యాపారవేత్త అని, ఆయనపేరు సూరపనేని శుభాకరరావు అంటూ చెప్పుకొచ్చాయి. వీటిని శ్రీలీల ఖండించకపోవడంతో అంతా అదే నిజం అనుకున్నారు. అయితే ఈ ఎపిసోడ్ కు ట్విస్ట్ ఇస్తూ, సదరు వ్యాపారవేత్త సూపరనేని శుభాకరరావు మీడియా ముందుకొచ్చారు.

పెళ్లిసందD హీరోయిన్ శ్రీలీల తన కూతురు కాదంటూ ప్రకటించారు శుభాకర్. అక్కడితో ఆగకుండా, ఆమె తన మాజీ భార్య కూతురు అనే విషయాన్ని బయటపెట్టారు. శ్రీలీల తల్లి, శుభాకర్ 20 ఏళ్ల కిందటే విడిపోయారంట. తామిద్దరం విడిపోయిన తర్వాత శ్రీలీల జన్మించిందని, ఆమెకు తను తండ్రిని కాదని ప్రకటించారు శుభాకర్.

ఈ మేరకు సూపరనేని సొసైటీలో తను ఫిర్యాదు కూడా చేశానని చెప్పుకొచ్చారు. అయితే ఉన్నఫలంగా శుభాకర్ ఇలా మీడియా ముందుకురావడానికి ఓ బలమైన కారణం ఉంది. శ్రీలీల తల్లి, శుభాకర్ మధ్య ఇంకా అప్పటి విడాకుల వ్యవహారం, ఆర్థిక లావాదేవీలు నడుస్తున్నాయి. తన ఆస్తులపై కన్నేసి, శ్రీలీల ఇలా తనను తండ్రిగా చెప్పుకుంటోందని ఆరోపించారు శుభాకర్.

ప్రస్తుతం తనకు ఒకే ఒక్క కూతురు ఉందని.. శ్రీలీల, ఆమె తల్లితో తనకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించారు శుభాకర్.