శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్. వెన్నెల కిషోర్ హీరోగా తయారైన సినిమా. అనన్య నాగళ్ల హీరోయిన్. ఒక కొత్త నిర్మాత, కొత్త దర్శకుడు వచ్చి తీసిన చిన్న సినిమా. ఈ చిన్న సినిమాతో అటు హీరో, ఇటు సంగీత దర్శకుడు ఆడేసుకుంటున్నారు. ముందుగా మాట్లాడుకున్నారో లేదో తెలియదు కానీ, హీరో వెన్నెల కిషోర్ మాత్రం సినిమా ప్రచారానికి రావడం లేదు. దీని మీద నిర్మాతలు చాలా అసంతృప్తిగా వున్నారు.
నిజానికి సినిమా హిట్ అయితే ముందుగా పేరు వచ్చేది, వరుసగా నాలుగు సినిమాలు చేతిలో పడేది వెన్నల కిషోర్ కే. సినిమా మీద ఇష్టం లేనపుడు ఎందుకు ఒప్పకొవాలి. సినిమా వర్క్ చేయాలి. ఇప్పుడు పబ్లిసిటీ మొహం చాటేయాలి.
అసలు తమకు హీరో వెన్నెల కిషోర్ కాదని, కథే హీరో అని, దాన్ని నమ్మే సినిమాను ముందుకు తీసుకెళ్తున్నామని శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ హోల్ సేల్ బయ్యర్ వంశీ నంది పాటి నిర్మొహమాటంగా అన్నారు. డబ్బులు పెట్టింది తాము కనక, అవసరం తమది కనుక సినిమాను జనం ముందుకు తమకు తోచినట్లే తీసుకెళ్తున్నామన్నారు.
ఇదిలా వుంటే ఈ సినిమాకు మ్యూజిక్ డైరక్టర్ సునీల్ కాశ్యప్. సినిమాలో ఓ పాటను రామ్ మిరియాలతో పాడించాలనుకున్నారు దర్శకుడు. కానీ మ్యూజిక్ డైరక్టర్ కు రామ్ మిరియాలకు మధ్య ఏదో సమస్య. దాంతో రాహుల్ సిప్లిగంజ్ వద్దకు వెళ్లారు. ఆయన పాడతా అన్నారు కానీ సునీల్ కాశ్యప్ స్టూడియోకి రానన్నారు. వేరే స్టూడియో కావాలన్నారు. దాంతో పాట రికార్డింగ్ కే రాలేదు మ్యూజిక్ డైరక్టర్. ఇక సినిమా ప్రచారానికి ఏం వస్తారు? అందుకే రాలేదు.
సినిమా హిట్ అయితే పరుగెత్తుకు వస్తారని, ఇప్పుడు రమ్మంటే రారని దర్శకుడు నిర్మొహమాటంగా అన్నారు. ఇదే చిన్న సినిమా ఏ పెద్ద బ్యానర్ అయినా తీసి వుంటే పరిస్థితి వేరుగా వుంటుంది. టాలీవుడ్ లో అంతే..టాలీవుడ్ లో అంతే.
Erri pappaa illaithe movie yelaaa hit avthundhi