బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై ఎట్టకేలకు రేవంత్‌రెడ్డి సర్కార్ ఏసీబీ కేసు నమోదు చేసింది. ఫార్ములా ఈ-కార్ రేసింగ్ వ్యవహారంలో నిధులు దుర్వినియోగం అయ్యాయంటూ ముగ్గురిపై ఏసీబీ కేసు నమోదు చేయడం చర్చనీయాంశమైంది. ఏ1గా కేటీఆర్, ఏ2గా ఐఏఎస్ అధికారి అరవింద్‌కుమార్, ఏ3గా హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్రెడ్డిపై అవినీతి నిరోధక శాఖ కేసు నమోదు చేయడం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తామని ప్రభుత్వంలో కీలక నాయకులు కొంతకాలంగా బహిరంగంగానే చెబుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావును తప్పకుండా కేసులో ఇరికించి, జైలుకు పంపుతారనే చర్చ తెలంగాణ రాజకీయాల్లో జరుగా సాగుతోంది. ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి విచారణ సాగుతోంది. విచారణ అనంతరం వాళ్లపై కూడా నమోదయ్యే అవకాశం వుంది.
తాజాగా కేటీఆర్ వంతు వచ్చింది. న్యాయ స్థానంలో ఊరట దక్కితే తప్ప, ఆయన అరెస్ట్ నుంచి తప్పించుకోలేకపోవచ్చు. మరోవైపు కేటీఆర్‌పై ఏసీబీ కేసు అంశాన్ని ఇవాళ అసెంబ్లీలో మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రస్తావించారు. తెలంగాణ ఇమేజ్ను పెంచడానికి కేటీఆర్ ప్రయత్నిస్తే, ఆయనపై అన్యాయంగా కేసు పెట్టారని ఆయన వాపోయారు. రానున్న రోజుల్లో ఏమవుతుందో చూడాలి.
What i am to say is neeku acb unte naku acb undi
ఎవరైనా చట్టానికి లోబడి ఉండాల్సిందే. తప్పు చేస్తే శిక్ష నుండి తప్పించుకోలేరు. KTR ఏమీ NTR లాంటి మహాత్ముడు కాదు.
NTR mahaatmuda??
తెలంగాణ లో ఈ ముక్కోడి నీచ కుటుంబం , ఆంధ్ర లో నీచుడు జగన్ రెడ్డి కుటుంబం తెలుగు జాతిని పీడిస్తున్న రాక్షస జాతి కుటుంబాలు