ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించిన సినీ నటుడు మోహన్‌బాబుకు తెలంగాణ హైకోర్టులో ఊరట దక్కలేదు. మధ్యంతర బెయిల్ కోసం మోహన్‌బాబు దాఖలు చేసుకున్న పిటిషన్‌పై ఇరుపక్షాల వాదనలు గురువారం ముగిశాయి. తుది తీర్పును సోమవారానికి న్యాయస్థానం వాయిదా వేసింది.
మోహన్‌బాబు కుటుంబ వివాదం వీధికెక్కిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా మోహన్‌బాబు, ఆయన చిన్న కుమారుడు మనోజ్ పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. అలాగే తమ కుటుంబ వ్యవహారాలను ప్రపంచానికి చూపేందుకు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారంటూ జర్నలిస్టులపై మోహన్‌బాబు దాడికి దిగారు.
దీంతో ఆయనపై హత్యాయత్నం కేసు నమోదైంది. అయితే అనారోగ్య కారణాలతో మోహన్‌బాబు ఆస్పత్రిపాలయ్యారు. అలాగే పోలీసుల విచారణకు హాజరయ్యేందుకు, అరెస్ట్ నుంచి ఈ నెల 24వ తేదీ వరకూ హైకోర్టు నుంచి మినహాయింపు పొందారు. ఆ తర్వాత విచారణకు సహకరించాలని మోహన్‌బాబును కోర్టు ఆదేశించింది.
ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు మోహన్‌బాబును అరెస్ట్ చేయలేదని రాచకొండ సీపీ పేర్కొన్నారు. మోహన్‌బాబును విచారించే విషయమై న్యాయ స్థానాన్ని ఆశ్రయిస్తామని, అక్కడి నుంచి వచ్చే ఆదేశాల మేరకు నడుచుకుంటామని సీపీ తెలిపారు. ఈ క్రమంలో మధ్యంతర బెయిల్ కోసం మోహన్‌బాబు హైకోర్టును ఆశ్రయించారు. అయితే ముందస్తు బెయిల్‌పై వాదనలు పూర్తయ్యాయి. ఏమవుతుందో అనే ఉత్కంఠ నెలకుంది. విచారణను ఈ నెల 23వ తేదీకి వాయిదా వేసింది.
“ కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన |
మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోஉస్త్వకర్మణి || ”