రాజాసాబ్.. ఆ లుక్ లీక్ అవ్వలేదు

రాజా సాబ్ సినిమాకు, లీక్ అయిన తన పిక్ కు సంబంధం లేదని క్లారిటీ ఇచ్చింది. ఆ ఫొటో ఓ యాడ్ షూట్ కు సంబంధించిందంట.

ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమా రాజా సాబ్. ఈ సినిమా నుంచి ప్రభాస్ లుక్స్ ఆల్రెడీ బయటకొచ్చేశాయి. మరి ముగ్గురు హీరోయిన్ల పరిస్థితేంటి? మెయిన్ హీరోయిన్ గా చేస్తున్న మాళవిక మోహనన్ లుక్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు? నిధి అగర్వాల్, రిద్ది కుమార్ సంగతేంటి?

ఇలా చర్చ నడుస్తున్న క్రమంలో ఉరుములేని పిడుగులా నిధి అగర్వాల్ ఫొటో ఒకటి ఆన్ లైన్ లో ప్రత్యక్షమైంది. అది కచ్చితంగా హరిహర వీరమల్లు సినిమా స్టిల్ కాదు. ఎందుకంటే, నిధి అందులో పూర్తిగా మోడ్రన్ లుక్ లో, బాడీ ఫిట్ మినీ వేసుకుంది.

పవన్ పీరియాడికల్ మూవీలో ఆమెది అలాంటి గెటప్ కాదు. సో.. మిగిలింది రాజసాబ్ మాత్రమే. కాబట్టి ప్రభాస్ సినిమా నుంచి నిధి అగర్వాల్ లుక్ ఇదేనంటూ తెగ ప్రచారం నడిచింది. ఆమె ఫస్ట్ లుక్ లీకైందంటూ కథనాలు వచ్చేశాయి.

ఎట్టకేలకు తన స్టిల్ పై నిది అగర్వాల్ స్పందించింది. రాజా సాబ్ సినిమాకు, లీక్ అయిన తన పిక్ కు సంబంధం లేదని క్లారిటీ ఇచ్చింది. ఆ ఫొటో ఓ యాడ్ షూట్ కు సంబంధించిందంట.

వాస్తవానికి రాజాసాబ్ నుంచి ఇప్పట్లో ఎలాంటి ప్రమోషనల్ మెటీరియల్ రాదు. ఎందుకంటే, ఆ సినిమా విడుదలపై సందిగ్దత నెలకొంది. దీంతో టీజర్ రిలీజ్ కూడా వాయిదా వేశారు. ఇలాంటి టైమ్ లో మరో ఫస్ట్ లుక్ ఎందుకు వదుల్తారు?