మళ్లీ ‘ఫ్యామిలీ’ బాట పట్టిన అడ్డాల

ప్రతి దర్శకుడికి ఓ బలం ఉంటుంది. ఆ జానర్ లో వాళ్లు అద్భుతాలు చేయగలరు. కానీ అన్ని కథల్ని హ్యాండిల్ చేయగలమనే ఇమేజ్ కోసం కొత్తకొత్తగా ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో కొంతమంది సక్సెస్ అవుతారు,…

ప్రతి దర్శకుడికి ఓ బలం ఉంటుంది. ఆ జానర్ లో వాళ్లు అద్భుతాలు చేయగలరు. కానీ అన్ని కథల్ని హ్యాండిల్ చేయగలమనే ఇమేజ్ కోసం కొత్తకొత్తగా ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో కొంతమంది సక్సెస్ అవుతారు, మరికొంతమంది ఫెయిల్ అవుతారు. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల అలా ఫెయిలైన దర్శకుడు.

ఫుల్ లెంగ్త్ యాక్షన్ మూవీ ట్రై చేశాడు ఈ దర్శకుడు. పెదకాపు-1 పేరిట తన శైలికి భిన్నంగా సినిమా తీశాడు. విడుదలకు ముందే సీక్వెల్ ప్రకటించాడు. అంతేకాదు, అందులో ఓ కీలక పాత్ర కూడా పోషించాడు.

ఇలా ఎన్నో ఆశలు పెట్టుకున్న పెదకాపు-1 సినిమా శ్రీకాంత్ అడ్డాలకు కలిసిరాలేదు. దీంతో ఇప్పుడీ దర్శకుడు తమ ఫేవరెట్ జానర్ లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఓ ఫ్యామిలీ స్టోరీ రాసుకున్నాడు. గతంలో సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు, బ్రహ్మోత్సవం లాంటి సినిమాలు తీసిన అనుభవంతో ఈసారి కూడా ఓ మంచి పాయింట్ అనుకున్నాడు.

పాయింట్ అనుకున్నదే తడవుగా స్టోరీ డెవలప్ చేశాడు. ఓ యంగ్ హీరోకు కథ వినిపించాడు. అతడికి స్టోరీ నచ్చింది కూడా. ఇంకొన్ని డెవలప్ మెంట్స్, మార్పుచేర్పులు ఉన్నాయి. అవన్నీ సెట్ అయితే, త్వరలోనే శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఓ ఫ్యామిలీ స్టోరీ ప్రకటన వస్తుంది.