'బిగ్ బాస్ 3' రన్నప్ శ్రీముఖి ఆ షో ముగిసిన వెంటనే మాల్దీవుల్లో విహరిస్తూ ఉంది. షో వల్ల కొంత కాలం పాటు ఫ్యామిలీ, ప్రైవేట్ లైఫ్ ను మిస్ అయిన ఈ టీవీ యాంకర్ కుటుంబంతో కలిసి మాల్దీవుల్లో సేదతీరుతూ ఉంది. అలా కుటుంబంతో మిస్ అయిన సమయం లోటును భర్తీ చేసుకుంటున్నట్టుగా ఉంది. ఈ నేపథ్యంలో బిగ్ హౌస్ లో తను నేర్చుకున్న పాఠాల గురించి శ్రీముఖి కూలంకషంగా చెప్పింది. అందులో ముఖ్యమైన విషయాలు ఇలా ఉన్నాయి…
-కుటుంబం విలువ మరింతగా తెలిసిందని అంటోంది ఈ యాంకర్. ఎవరికైనా దూరంగా ఉన్నప్పుడే వారి విలువ బాగా తెలుస్తుంది కదా! బిగ్ బాస్ షో వల్ల కుటుంబానికి దూరంగా ఉండాల్సి రావడంతో, తనకు కుటుంబం విలువ మరింతగా తెలిసివచ్చిందని ఈమె చెబుతోంది. ప్రస్తుతం కుటుంబంతో విహారాన్ని ఆస్వాదిస్తున్నట్టుగా, తన తమ్ముడుతో ఆప్యాయతను పంచుకుంటున్నట్టుగా చెప్పింది. తన తమ్ముడు తన విషయంలో ఎంతో ప్రొటెక్టివ్గా, పొసెసివ్ గా ఉంటాడని శ్రీముఖి అంటోంది.
-బిగ్ బాస్ హౌస్ లో తనతో పాటు ఉన్న వారందరి మీదా తనకు గౌరవం ఉందని ఆమె అంటోంది. వారందరూ రియల్ ఫైటర్స్ అని కితాబిస్తోంది.
-హౌస్ లో తను వేయించుకున్న బిగ్ బాస్ ఐ టాట్టూ నిజమైనదే అని ఈమె చెబుతోంది. అది పర్మినెంట్ అని వివరిస్తోంది.
-బిగ్ బాస్ హౌస్ లో తిండికి లోటు ఉండదని శ్రీముఖి చెబుతూ ఉంది. తమకు సరిపడ రేషన్ ఉండదని చాలామంది అనుకుంటారని, అయితే హౌస్ లో తమకు అనేక స్పెషల్ డిష్ లు అందుబాటులో ఉంటాయని చెప్పింది. హౌస్ లో తను వెయిట్ పెరిగినట్టుగా కూడా వివరించింది.
-ఎలాంటి ప్రయోగానికి అయినా, సాహసానికి అయినా, కొత్తదనానికి అయినా 'నో చెప్పకూడదు' అనేది తను బిగ్ బాస్ హౌస్ నుంచి నేర్చుకున్న పెద్ద పాఠమని ఈ యాంకర్ వివరించింది.
-బిగ్ బాస్ త్రీ విషయంలో తన దృష్టిలో రియల్ విన్నర్ బాబా భాస్కర్ అని శ్రీముఖి అంటోంది.
-రాహుల్ సిప్లిగంజ్ తనకు గతంలో స్నేహితుడే అని, ఇకపై కూడా స్నేహితుడే అని శ్రీముఖి వ్యాఖ్యానించింది. 'హౌస్ లో జరిగిపోయిందేదో జరిగిపోయింది..దాన్ని అక్కడితోనే వదిలేశాను..' అని అంటోంది.
-ఫలితంతో సంబంధం లేకుండా హౌస్ ఎక్స్ పీరియన్స్ తనకు చాలా ఆనందాన్ని ఇచ్చిందని ఈ ప్రముఖ టీవీ యాంకర్ తేల్చి చెప్పింది.