కాంగ్రెస్ పార్టీ.. కాషాయంతో దోస్తీకి సై!

కాలంతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా మారుతుందా? దేశంలో వీస్తున్న కాషాయ పవనాలు అనుగుణంగా ఒక కాషాయ పార్టీతో చేతులు కలుపుతుందా? శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. కాంగ్రెస్ పార్టీ  కచ్చింతంగా రూటు…

కాలంతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా మారుతుందా? దేశంలో వీస్తున్న కాషాయ పవనాలు అనుగుణంగా ఒక కాషాయ పార్టీతో చేతులు కలుపుతుందా? శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. కాంగ్రెస్ పార్టీ  కచ్చింతంగా రూటు మార్చినట్టే.

ఇటీవలే శివసేన వాళ్లు చేసిన ప్రతిపాదనతో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని కలిశారు శరద్ పవార్. బీజేపీని వదులుకుని, తాము మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి రెడీ అని సేన సోనియాకు పవార్ ద్వారా సమాచారం అందించిందట. మహారాష్ట్రలో కాంగ్రెస్, సేన, ఎన్సీపీల కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం గురించి అప్పుడే సోనియాకు సమాచారం ఇచ్చారట. అయితే హిందుత్వ వాద పార్టీ అయిన సేనతో చేతులు కలిపితే బాగోదని సోనియా వ్యాఖ్యానించినట్టుగా కాంగ్రెస్ వాళ్లు లీకులు ఇచ్చారు.

అయితే ఇప్పుడు మహారాష్ట్రలో రాజకీయం సేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కాంబోగా మారే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. తాము ప్రతిపక్ష వాసానికి రెడీ  అని బీజేపీ ప్రకటిస్తూ ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఈ కూటమి ప్రభుత్వం  ఏర్పడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి.

అయితే సేనతో చేతులు కలిపితే కాంగ్రెస్ తీరులో కూడా చాలా మార్పు వచ్చినట్టే! నిత్యం కాషాయం ధరించే పార్టీతో కాంగ్రెస్ పార్టీ చేతులు  కలిపితే కథ మారినట్టే. అయితే ఇందుకు అనుగుణంగా సేన నేతలు ఇప్పటికే కొత్త డైలాగులు వల్లెవేస్తూ ఉన్నారు. కాంగ్రెస్  అంటరానీ పార్టీ కాదని వారు అంటున్నారు, అలాగే ఇది వరకూ జమ్మూ అండ్ కశ్మీర్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు బీజేపీ వాళ్లు పీడీపీతో చేతులు  కలపడాన్ని ఇప్పటికే సేన నేతలు ప్రస్తావించారు కూడా!