తప్పులు మీద తప్పులు చేయడం ఇష్టంలేదు

కొత్త ఏడాది బౌన్స్ బ్యాక్ అవుతానంటున్నాడు శ్రీనువైట్ల. ఆగడు, బ్రూస్ లీ, మిస్టర్, అమర్ అక్బర్ ఆంటోనీ.. ఇలా వరుసపెట్టి ఫ్లాపులు ఇస్తున్న ఈ డైరక్టర్, కావాలనే గ్యాప్ తీసుకున్నానని ప్రకటించుకున్నాడు. తప్పుల మీద…

కొత్త ఏడాది బౌన్స్ బ్యాక్ అవుతానంటున్నాడు శ్రీనువైట్ల. ఆగడు, బ్రూస్ లీ, మిస్టర్, అమర్ అక్బర్ ఆంటోనీ.. ఇలా వరుసపెట్టి ఫ్లాపులు ఇస్తున్న ఈ డైరక్టర్, కావాలనే గ్యాప్ తీసుకున్నానని ప్రకటించుకున్నాడు. తప్పుల మీద తప్పులు చేయడం ఇష్టంలేకనే.. అవకాశాలొచ్చినా సినిమాకు దూరంగా ఉన్నానంటున్నాడు.

“ఈ ఏడాదే సినిమా చేద్దామని చాలా అనుకున్నాం. కానీ నాకు తప్పులు మీద తప్పులు చేయడం ఇష్టంలేదు. బ్రేక్ తీసుకుందాం అనుకున్నాను. అందుకే ఎవ్వరికీ కనిపించలేదు. కావాలనే ఆగాను. నిజానికి నేను ఏదైనా ఐడియాకు కనెక్ట్ అయితే స్క్రిప్ట్ చేసుకుంటూ వెళ్లిపోతాను. వర్కవుట్ అవుతుందా అవ్వదా అని వెనక్కి తిరిగి చూసుకోలేదు. కానీ ఈసారి మాత్రం కంగారు పడదలుచుకోలేదు. చేసేది పక్కాగా చేద్దామని గ్యాప్ తీసుకున్నాను.”

ప్రస్తుతం ఆడియన్స్ బాగా మారిపోయారంటున్నాడు వైట్ల. కేవలం వినోదం అందిస్తే పని జరగని, మంచి కథ కూడా వాళ్లకు చూపించాలని అంటున్నాడు. అందుకే చాలా వర్కవుట్ చేస్తున్నానని, ఎట్టకేలకు ఓ కథ ఫైనలైజ్ చేశానని చెప్పుకొచ్చాడు.

“ఆడియన్స్ కూడా చాలా మారిపోయారు. కథను గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. అది తప్పించి ఇంకేం చేసినా యాక్సెప్ట్ చేయడం లేదు. అలాంటి కొత్త కథలో ఎంటర్ టైన్ మెంట్ యాడ్ చేసి చెప్పడం చిన్న విషయం కాదు. అలాంటి 4 కథల్ని పట్టుకొని పక్కనపెట్టి, ఫైనల్ గా అందులోంచి ఒకటి అనుకున్నాను. అది దాదాపు 70శాతం స్క్రిప్ట్ వర్క్ అయిపోయింది. కొత్త ఏడాదిలో ఎనౌన్స్ చేస్తాను.”

వరుస ఫ్లాపులతో ఏమాత్రం కుంగిపోలేదంటున్నాడు వైట్ల. శారీరకంగా, మానసికంగా మరింత దృఢంగా తయారయ్యానని, కొన్నేళ్లుగా కుటుంబ పరంగా పూర్తిచేయాల్సిన పనుల్ని కూడా పూర్తిచేయడానికి టైమ్ దొరికిందని చెబుతున్నాడు. అయితే ఏ సినిమా చేసినా అందులో తన స్టయిల్ మాత్రం మిస్ అవ్వనంటున్నాడు ఈ దర్శకుడు.

వాళ్ళకంటే నా రెమ్యునరేషన్ 50% తక్కువ