స‌ల‌హాలు అక్క‌ర్లేదంటున్న ద‌క్షిణాది స్టార్‌

శృతిహాస‌న్‌…ద‌క్షిణాది స్టార్‌. బోల్డ్‌గా మాట్లాడే హీరోయిన్‌గా గుర్తింపు పొందారు. అగ్ర హీరో క‌మ‌ల్‌హాస‌న్ కూతురిగా తెరంగేట్రం చేసినా … త‌న సొంత కాళ్ల‌పై నిల‌డేందుకు కృషి చేస్తుంటారు. అగ్ర న‌టుడి కూతురిగా కంటే, న‌ట‌న‌తో…

శృతిహాస‌న్‌…ద‌క్షిణాది స్టార్‌. బోల్డ్‌గా మాట్లాడే హీరోయిన్‌గా గుర్తింపు పొందారు. అగ్ర హీరో క‌మ‌ల్‌హాస‌న్ కూతురిగా తెరంగేట్రం చేసినా … త‌న సొంత కాళ్ల‌పై నిల‌డేందుకు కృషి చేస్తుంటారు. అగ్ర న‌టుడి కూతురిగా కంటే, న‌ట‌న‌తో త‌న‌కంటూ సొంత గుర్తింపు ఉండాల‌నేది శృతి హాస‌న్ ఆకాంక్ష‌. అందుకు త‌గ్గ‌ట్టే ఆమె బిహేవియ‌ర్ కూడా ఉంటుంది.

సోష‌ల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటూ అభిమానుల‌తో మ‌న అభిప్రాయాలు ఎప్ప‌టిక‌ప్పుడు షేర్ చేసుకుంటుంటారామె. తాజాగా ఆమె అనేక విష‌యాల‌పై నిర్మొహ‌మాటం లేకుండా మాట్లాడారు. హీరోయిన్‌గా ఎలాంటి ల‌క్ష్యాల్ని పెట్టుకోలేద‌ని, జీవితాన్ని య‌థాత‌థంగా తీసుకోవాలని తాను న‌మ్ముతాన‌న్నారు. ఇత‌రుల అంచ‌నాలు, ఆకాంక్ష‌ల‌కు త‌గ్గ‌ట్టు తాను బ‌త‌కాల‌నుకోన‌ని ఆమె తేల్చి చెప్పారు.

త‌న జీవితంలో సినిమా అనేది కేవ‌లం ఓ భాగ‌మ‌ని, అంతేత‌ప్ప సినిమానే జీవిత‌మ‌ని భావించ‌న‌న్నారు.  బాలీవుడ్‌లో  అవకాశాలు రానంత మాత్రాన కెరీర్‌ ముగిసినట్లు కాదన్నారు. తమిళ, తెలుగు భాషల చిత్ర ప‌రిశ్ర‌మ‌లు త‌నకు ఫ‌స్ట్ ప్ర‌యారిటీగా శృతి చెప్పుకొచ్చారు.

తాను దక్షిణాది అమ్మాయినైనందుకు గ‌ర్విస్తాన‌ని శృతిహాస‌న్ కాసింత భావోద్వేగంతో చెప్పుకొచ్చారు. తమిళం, తెలుగు నాకు రెండు కళ్లతో సమానమ‌న్నారు.  కెరీర్‌ విషయంలో తాను ఎవరి సలహాలు తీసుకోన‌ని, అలాగే అవ‌స‌రం కూడా లేద‌ని తేల్చి చెప్పారు. ఆత్మసాక్షి మేరకే నడచుకుంటాన‌ని, మనసుకు నచ్చిన సినిమాలే చేస్తుంటానని వెల్ల‌డించారు.  

కొంచెం కొత్తగా.. కొత్త పలుకు