టాలీవుడ్ లోకి యంగ్ బ్లడ్ ఫుల్ గా ప్రవహిస్తోంది. కొత్త కొత్త కాన్సెప్ట్ లు, కొత్త కథలు తయారు చేసే పనిలో పడ్డారు. యంగ్ హీరో రాజ్ తరుణ్ తో తయారైన స్టాండప్ రాహుల్ సినిమా ట్రయిలర్ విడుదలయింది. అది చూస్తే ఇదే ఆలోచన కలుగుతుంది. ఈ సినిమాలో రాజ్ తరుణ్ స్టాండప్ కమెడియన్ గా కనిపిస్తున్నాడు వర్ష బొల్లమ్మ ఙోడీగా నటిస్తోంది.
ట్రయిలర్ కొత్తగా వుంది. పాత్రలు వెరైటీగా వున్నాయి. కానీ ఎక్కడో డెప్త్ లో చూస్తుంటే పాత్రల నేపథ్యాలు పెద్దగా కొత్తగా అనిపించడం లేదు. ఇంద్రజ, మురళీశర్మ, రాజ్ తరుణ్, వర్ష్ వీళ్ల పాత్రలు అన్నీ గతంలో చూసినట్లుగానే వున్నాయి. వీరి చుట్టూ అల్లిన కథ కూడా కొత్తగా అనిపించడం లేదు. అయితే ట్రీట్ మెంట్ కొత్తగా వుంది. ఈ ఙనరేషన్ టెకింగ్ అన్నట్లుగా లైవ్ గా, ఈజ్ గా వుంది.
బంధాలకు కట్టుబడకుండా, జీవితాన్ని లైట్ తీసుకుని సాగిపోయే అబ్బాయి, అతడికి కనెక్ట్ అయిన అమ్మాయి, వారి లివింగ్ టు గెదర్, లవ్, రొమాన్స్, ఎమోషన్లు అన్నీ ట్రయిలర్ లో కనిపించాయి. వాటితో పాటు ట్రయిలర్ కనుక కాస్త లైట్ బూతులు కూడా.
హీరో స్టాండప్ కమెడియన్ కాబట్టి ఫన్ సినిమాలో గట్టిగానే వుంటుందని ట్రయిలర్ వెల్లడిస్తోంది. మొత్తం మీద ఓ డిఫరెంట్ స్మాల్ ఫిలిమ్ అన్ కార్డ్స్ అన్నట్లుగా వుంది…స్టాండప్ రాహుల్.