అనిల్ రావిపూడి-వెంకటేష్-వరుణ్ తేజ్ కాంబినేషన్ లో తయారవుతున్న సినిమా ఎఫ్ 3. ఫన్..ఫ్రస్టేషన్ కు..ఈసారి ఫార్ట్యూన్ తోడయింది. మరింత ఫన్ వుంటుందా వుండదా అన్నది సినిమా చూస్తే కానీ తెలియదు.
ఎఫ్ 2 టీమ్ తో పాటు మరికొన్ని కొత్త ఫేస్ లు యాడ్ అయ్యాయి. వాయిదాలు పడుతూ ఆఖరికి సమ్మర్ లో మాంచి డేట్ ను లాక్ చేసారు. మే 27న ఎఫ్ 3 విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.
అయితే ఇఫ్పటి నుంచే సినిమాకు బజ్ తీసుకురావడానికి రెడీ అయిపోయారు. డిఫరెంట్ గా పబ్లిసిటీ చేయాలని ఫిక్స్ అయిపోయారు. యూ ట్యూబర్ గా పాపులరై, సినిమాల్లోకి వచ్చిన నటి సునయనతో ఓ షార్ట్ విడియో చేసి వదిలారు.
సెట్ లో సునయన డైరక్టర్ అనిల్ ను, వెంకీ, వరుణ్ లను కలిసి హడావుడి చేయడం, ఆ క్రమంలో ఆ భారీ సెట్ ను చూపించడం చేసారు.
మరోసారి విడుదల డేట్ ను ఆ విధంగా పక్కగా ప్రకటించారు. ఈసినిమా మీద నిర్మాత దిల్ రాఙు, దర్శకుడు అనిల్ రావిపూడి చాలా హోప్స్ పెట్టుకున్నారు. ఎఫ్ 2 తరువాత వెంటనే ప్రారంభించినా రెండు కరోనా ఫేజ్ ల కారణంగా ఈ ప్రాజెక్టు అలా డిలే అవుతూ వస్తోంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సమ్మర్ ను మిస్ కాకూడదని చూస్తున్నారు.