అడ్వాన్స్ వెనక్కి ఇచ్చిన సీనియర్ హీరో

వరుసపెట్టి సినిమాలు చేస్తున్న హీరో అతడు. నిర్మాణ భాగస్వామ్యంలో వరుసపెట్టి సినిమాలు నిర్మిస్తున్న కార్పొరేట్  కంపెనీ అది. వీళ్లిద్దరి మధ్య ఒప్పందం కుదిరింది. కథ ఏంటి, దర్శకుడు ఎవరనేది హీరో ఇష్టం. నిర్మాణ భాగస్వామ్యంలో…

వరుసపెట్టి సినిమాలు చేస్తున్న హీరో అతడు. నిర్మాణ భాగస్వామ్యంలో వరుసపెట్టి సినిమాలు నిర్మిస్తున్న కార్పొరేట్  కంపెనీ అది. వీళ్లిద్దరి మధ్య ఒప్పందం కుదిరింది. కథ ఏంటి, దర్శకుడు ఎవరనేది హీరో ఇష్టం. నిర్మాణ భాగస్వామ్యంలో సినిమా చేయాలి.. కలిసి విడుదల చేయాలి, నాన్-థియేట్రికల్ రైట్స్ మొత్తం తమ సొంతం కావాలనేది సదరు కంపెనీ ఒప్పందం. ఈ మేరకు ఆ బడా హీరోకు 20 కోట్ల రూపాయల అడ్వాన్స్ కూడా ఇచ్చేసింది.

అంతా ఓకే. రేపోమాపో అధికారిక ప్రకటన అనుకున్న టైమ్ లో డీల్ ఆగిపోయింది. అడ్వాన్స్ ను వెనక్కు తిరిగి ఇచ్చేశారు ఆ హీరో. తాజాగా ఫ్లాప్ అయిన ఓ సినిమానే దీనికి కారణం అంటున్నారు చాలామంది. మరికొంతమంది మాత్రం సినిమాల విషయంలో ఆచితూచి వెళ్లాలనే ఉద్దేశంతోనే ఆ హీరో వెనక్కి తగ్గినట్టు చెబుతున్నారు.

కానీ ఈ రెండూ కారణాలు కావు. అగ్రిమెంట్ ప్రకారం 2023 చివరి నాటికి సినిమాను పూర్తిచేసి విడుదల చేయాలి. ఆ టార్గెట్ ను అందుకోవడం సదరు పెద్ద హీరోకు కష్టం. ఎందుకంటే, ఆల్రెడీ చేతిలో సినిమాలున్నాయి. అవి పూర్తయిన తర్వాతే ఈ ప్రాజెక్టు టేకప్ చేయాలి. అందుకే అడ్వాన్స్ వెనక్కి ఇచ్చేశారంట.

మెగా హీరోలతో సినిమాలు చేసేందుకు ఆ కంపెనీ ఎప్పుడూ ఉత్సాహం చూపిస్తుంది. ఇప్పటికే సాయితేజ్ తో సినిమా చేసింది. రామ్ చరణ్ తో సినిమా పైప్ లైన్లో ఉంది. పవన్ కల్యాణ్ తో డీల్ ఆల్రెడీ లాక్ అయింది. ఇక మిగిలిన ఒకే ఒక్క 'మెగా' హీరోతో సినిమా చేద్దామనుకుంటే అది కాస్తా బెడిసికొట్టింది. ప్రస్తుతానికి ఇంకా డీల్ క్లోజ్ కాలేదు. చర్చలు  సాగుతున్నాయి.