స్టూడియోని దయతల్చింది ఎవరు?

విశాఖ బీచ్ ఒడ్డున మాంచి ఏరియాలో ఓ కొండ కొండ మొత్తం ఇచ్చేసారు రామానాయుడు స్టూడియోకి ఎకరా పాతిక లక్షల వంతున. దాదాపు 35 ఎకరాలు. Advertisement ఎవరు? చంద్రబాబు నాయడు. దేనికి స్టూడియో…

విశాఖ బీచ్ ఒడ్డున మాంచి ఏరియాలో ఓ కొండ కొండ మొత్తం ఇచ్చేసారు రామానాయుడు స్టూడియోకి ఎకరా పాతిక లక్షల వంతున. దాదాపు 35 ఎకరాలు.

ఎవరు? చంద్రబాబు నాయడు.

దేనికి స్టూడియో కట్టి, విశాఖలో సినిమా పరిశ్రమ అభివృద్దికి సహకరించమని. కానీ అదే చంద్రబాబు హయాంలో ఏమైనా కట్టారా? అస్సలు లేదు.

వైఎస్ వచ్చిన తరువాత అటు దృష్టి పెట్టేసరికి..విమర్శలు. సరే. స్టూడియో కట్టండి మరి అని కనికరించారు. ఏదో కట్టాం అనిపించారు. కానీ ఇప్పటి వరకు అక్కడ జరిగిన షూటింగ్ లు ఎన్ని? విస్తరణ ఏ మేరకు? అభివృద్ది ఎంత?

తరువాత మళ్లీ అధికారంలోకి వచ్చింది చంద్రబాబే.

మరి 2012 నుంచి ఇప్పటి వరకు వేకెట్ లాండ్ టాక్స్ చెల్లించలేదట. కోటి రూపాయలకు పైగానే. కొన్ని వందల కోట్ల టర్నోవర్ తో వ్యాపారాలు సాగించే సంస్థ కేవలం పదేళ్ల పాటు కోటి రూపాయలకు పైగా చెల్లించకపోవడం, దానిని అధికారులు పట్టించుకోకపోవడం.

2012 నుంచి 2019 వరకు అధికారంలో వున్నది ఎవరు? ఇదే కనుక వైకాపా రాగానే పట్టించుకుని ఏదైనా చర్య తీసుకుంటే, అదిగో కక్షసాధింపు అనే ట్యాగ్ తగిలించి వుండేవారు.

ఇక్కడ ఇంకో గమ్మత్తు వుంది. 2012 నుంచి ఇప్పటి వరకు స్టూడియోకి టాక్స్ రివిజన్ కూడా జరగలేదట. ఫ్లాటో, ఇల్లో వుంటే సామాన్యుడి విషయంలో ఇలాగే చేస్తారా? మరి 2012 నుంచి 2019 వరకు పన్ను రివిజన్ జరగకపోతే బాధ్యత ఎవరిది? 2019 తరువాత చేసి వుంటే అదిగో బాదుడే..బాదుడు అనేవారు కాదా?

అయినా వేల కోట్ల ఆస్తులు, టర్నోవర్, కోట్లకు కోట్ల రెమ్యూనిరేషన్లు తీసుకునే ఇద్దరు హీరోలు వుండి కూడా ఇలా చేయడం ఏమిటో ఆ సంస్థ.