ప‌వ‌న్ క్యారెక్ట‌ర్‌లో స్టైలిష్ స్టార్!

జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ పాత్ర‌ను స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పోషించారా? అంటే …ఔన‌నే స‌మాధానం వ‌స్తుంది. అయితే ఆ సినిమా ఏంటి? ద‌ర్శ‌క నిర్మాత‌లెవ‌రు? బ‌న్ని స‌ర‌స‌న న‌టించే హీరోయిన్ ఎవ‌రు త‌దిత‌ర…

జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ పాత్ర‌ను స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పోషించారా? అంటే …ఔన‌నే స‌మాధానం వ‌స్తుంది. అయితే ఆ సినిమా ఏంటి? ద‌ర్శ‌క నిర్మాత‌లెవ‌రు? బ‌న్ని స‌ర‌స‌న న‌టించే హీరోయిన్ ఎవ‌రు త‌దిత‌ర ప్ర‌శ్న‌ల‌కు జ‌వాబులు దొర‌క‌వు. ఎందుకంటే అల్లు అర్జున్ న‌టించింది సినిమాలో కాదు కాబ‌ట్టి.

ఇంత‌కూ అస‌లు విష‌యంలోకి వెళ్దాం. నిన్న (ఏప్రిల్ 23) ప్ర‌పంచ పుస్త‌క దినోత్స‌వం. పుస్త‌కాలంటే త‌న‌కెంత ప్రాణ‌మో ప‌లు సంద‌ర్భాల్లో ప‌వ‌న్‌క‌ల్యాణ్ చెప్పిన సంగ‌తి తెలిసిందే. పుస్త‌కాలే లోకంగా, ప్రాణంగా త‌న జీవితం ముందుకు కొన‌సాగుతోంద‌ని ప‌వ‌న్ ప్ర‌క‌టించుకున్నారు. నిజంగా ఇది మెచ్చుకోవాల్సిన విష‌య‌మే.

“పుస్త‌కాలు నా మ‌న‌సుకు, హృద‌యానికి రెక్క‌ల‌నిచ్చాయి. నేను బుర‌ద‌లోంచి బ‌య‌ట‌ప‌డ‌టానికి ఎంతో తోడ్ప‌డ్డాయి. పుస్తకాలు చ‌ద‌వ‌క‌పోతే నా చుట్టూ ఉన్న మౌఢ్యం, నీచంలోను మునిగిపోయి ఉండేవాన్ని. విశాల‌మైన ప్ర‌పంచ దృశ్యాల‌ను పుస్త‌కాలు నా ముందు ప‌రిచాయి” అని ప్ర‌పంచ ప్ర‌సిద్ధిగాంచిన ర‌చ‌యిత మాక్జిం గోర్కి ఈ మాట‌ల‌న్నారు. ఇదే రేంజ్‌లో మ‌న ప‌వ‌న్‌క‌ల్యాణ్ కూడా పుస్త‌కాల వ‌ల్ల త‌న‌ కొత్త ప్రాపంచిక దృక్ప‌థం విస్తృత‌మైంద‌ని చెప్పుకొచ్చారు.

ప్ర‌పంచ పుస్త‌క దినోత్స‌వం సంద‌ర్భంగా అనూహ్యంగా ప‌వ‌న్‌క‌ల్యాణ్ కాకుండా, అల్లు అర్జున్ పుస్త‌కం చ‌దువుతూ సోష‌ల్ మీడియాలో ప్ర‌త్య‌క్షం కావ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించింది. అల్లు అర్జున్ పుస్త‌కం చ‌దువుతున్న‌ ఫొటోని ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా ఆయ‌న భార్య స్నేహారెడ్డి అభిమానుల‌తో పంచుకోవ‌డం విశేషం.

అది కూడా ప్ర‌పంచ పుస్త‌క దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని బ‌న్నీని మ‌రో రూపంలో అభిమానుల‌కు చూపాల‌నే ప్ర‌య‌త్నం ఆక‌ట్టుకుంది. దీంతో పుస్త‌క పురుగు ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఎక్క‌డ‌? అంటూ స‌ర‌దా కామెంట్స్ సోష‌ల్ మీడియాలో క‌నిపించాయి. మ‌రికొంద‌రు నెటిజ‌న్లు ప‌వ‌న్ క్యారెక్ట‌ర్‌లో స్లైలిష్ స్టార్ అంటూ స‌ర‌దా కామెంట్స్ చేయ‌డం గ‌మ‌నార్హం.