ప్రముఖ దర్శకురాలు సుధా కొంగర తీవ్రంగా గాయపడ్డారు. ఆమె చేతికి చాలా పెద్ద దెబ్బ తగిలింది. కట్టు కట్టిన వైద్యులు, ఆమెను నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.
తను గాయపడిన విషయాన్ని సుధాకొంగర ధృవీకరించారు. చాలా బాధగా ఉందని, దెబ్బ బాధిస్తోందని, నెల రోజులు రెస్ట్ తప్పదని ట్వీట్ చేశారు. ఇలాంటి బ్రేక్ ను తను ఎప్పుడూ కోరుకోలేదని అన్నారు.
ప్రస్తుతం హిందీలో అక్షయ్ కుమార్ హీరోగా సినిమా తెరకెక్కిస్తున్నారు సుధా కొంగర. తమిళ్ లో సూపర్ హిట్టయిన సూరారై పొట్రు (తెలుగులో ఆకాశం నీ హద్దురా) సినిమాకు రీమేక్ ఇది.
సుధా కొంగర గాయపడ్డంతో, అక్షయ్ కుమార్ సినిమాకు అనుకోని బ్రేక్ పడింది. ఈ సినిమా తర్వాత హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై ఓ సినిమాకు కమిట్ అయ్యారు సుధా కొంగర.