వీళ్లిద్దరూ కలిసి సినిమా చేస్తే చూడాలని చాలామంది కోరిక. కానీ ఇప్పటివరకు అది కార్యరూపం దాల్చలేదు. అలాంటిది మహేష్ సినిమాలో సుధీర్ బాబు ఏకంగా విలన్ గా కనిపిస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా ఇదే ప్రశ్న ఎదురైంది ఈ హీరోకి.
“మహేష్ మూవీలో విలన్ గా చేయడానికి ప్రాబ్లమ్ లేదు. క్యారెక్టర్ బాగుంటే చేస్తాను. ఈ అవకాశం లేకపోయినా నార్మల్ గా మహేష్ తో ఒకట్రెండు సినిమాల్లో కనిపిస్తే బాగుంటుంది. ఆయన సినిమాల్లో కనిపించాలని నాకు ఉంది.”
తను వెళ్లి అడిగి, మహేష్ సినిమాలో కనిపించడం పెద్ద సమస్య కాదంటున్నాడు సుధీర్ బాబు. అయితే ఆ కనిపించేదేదో మంచి ఉద్దేశంతో, మంచి పాత్రతో కనిపిస్తే ఆడియన్స్ కు గుర్తుంటుందనేది సుధీర్ బాబు అభిప్రాయం. మహేష్ సినిమాల్లో ఊరికే అలా ఓసారి కనిపించాలనుకుంటే ఈపాటికి ఎప్పుడో మహేష్ తో సినిమా చేసి ఉండేవాడినని చెబుతున్నాడు.
మహేష్ తో ఫోన్ లో రెగ్యులర్ గా టచ్ లో ఉంటానని చెబుతున్న సుధీర్ బాబు.. నెలలో ఒకట్రెండు సార్లు నేరుగా కలుస్తుంటామని చెబుతున్నాడు. తక్కువ పెర్ఫార్మెన్స్ తో ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేయడం మహేష్ కు మాత్రమే సాధ్యమని చెబుతున్నాడు ఈ హీరో.