దేశ స్థాయి, రాష్ట్ర స్థాయి నుంచి గల్లీ స్థాయికి..!

ఓ రాజకీయ నాయకుడి స్థాయి, తను తలకెత్తుకునే సమస్య ఏంటనే అంశంపై ఆధారపడి ఉంటుంది. ఓ కార్పొరేటర్ ఎత్తుకునే సమస్యకు, ఓ ముఖ్యమంత్రి హ్యాండిల్ చేసే ఇష్యూకు చాలా తేడా ఉంటుంది. ఈ రకంగా…

ఓ రాజకీయ నాయకుడి స్థాయి, తను తలకెత్తుకునే సమస్య ఏంటనే అంశంపై ఆధారపడి ఉంటుంది. ఓ కార్పొరేటర్ ఎత్తుకునే సమస్యకు, ఓ ముఖ్యమంత్రి హ్యాండిల్ చేసే ఇష్యూకు చాలా తేడా ఉంటుంది. ఈ రకంగా చూసుకుంటే చంద్రబాబు స్థాయి జాతీయ స్థాయి నుంచి గల్లీ స్థాయికి పడిపోయిందని చెప్పక తప్పదు. 

ఎందుకంటే గడిచిన ఏడాదిగా ఆయన ఎత్తుకుంటున్న సమస్యలు అలా ఉన్నాయి మరి.

విజయవాడ ప్రజావేదిక కోసం పోరాటం..

వైఎస్ జగన్ పై టీడీపీ తొలిపోరు ప్రజావేదిక నుంచే మొదలైంది. అసలు ప్రజా వేదికకు, ఏపీ ప్రజలకు ఏంటి సంబంధం. అసలెప్పుడైనా ఎవరైనా ఆ ప్రజా వేదికలో తమ సమస్యలను పరిష్కరించుకోగలిగారా. కేవలం చంద్రబాబు మెహర్బానీ కోసం ఏర్పాటు చేసిన వేదిక అది. దాన్ని కూల్చేసినప్పుడు రోడ్డెక్కిన బాబు, ప్రజా వేదిక లేకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడిపోతున్నట్టు కలరింగ్ ఇచ్చారు.

చలో ఆత్మకూరు..

ఇది కూడా ప్రజల కోసం చేసిన పోరాటం కాదు, కార్యకర్తలకు అండగా నిలబడ్డామనే పేరు కోసం చంద్రబాబు ఆడిన పెద్ద డ్రామా. చలో ఆత్మకూరు అంటూ ఎక్కడికక్కడ పోలీసులతో గొడవపడి టీవీలకు, పేపర్లకు ఎక్కారు టీడీపీ నేతలు. ప్రజా ప్రయోజనాలను పూర్తిగా అటకెక్కించారు.

అమరావతి కోసం పోరాటం

చంద్రబాబు ఈ 14 నెలల్లో చేసిన అతి దారుణమైన తప్పు ఇదే. అమరావతి కోసం పోరుబాట అంటూ.. రాష్ట్రమంతా కదలి రావాలంటారు. భార్యచేతి రెండు గాజులు విరాళంగా ఇప్పించి రాష్ట్రమంతా జోలెపట్టాలనుకున్నారు కానీ అది సగంలోనే ఆగిపోయింది. కొన్ని గ్రామాల సమస్యను రాష్ట్ర సమస్యగా చిత్రీకరించాలని చూసి బొక్కబోర్లా పడ్డారు బాబు. తన బినామీల కోసం చంద్రబాబు చేసిన పోరాటం ఇది.

అవినీతి నాయకుల కోసం ఆరాటం

అధికారంలో ఉన్నప్పుడు చేసిన అవినీతి, అక్రమాలకు టీడీపీ నాయకులు ఒక్కొక్కరే అరెస్ట్ అవుతున్నారు. ఇలా అరెస్ట్ అయిన నాయకుల్ని జైలులో పెడితే.. ఏదో “దేశ్ కీ నేత”లు ఇబ్బంది పడినట్టు తెగ ఫీలైపోతున్నారు బాబు. ప్రజా సమస్యల కోసం ఎప్పుడూ జనంలోకి రాని నారా లోకేష్ ని జేసీ సోదరుల కోసం అనంతపురానికి, అచ్చెన్నాయుడి కుటుంబం కోసం శ్రీకాకుళానికి పంపించారు. బీసీలను తొక్కేస్తున్నారు, ఎస్సీలను నలిపేస్తున్నారంటూ ఏడుపులు దీనికి అదనం. 

ఇవేవీ ప్రజల సమస్యలు కావు, కేవలం చంద్రబాబు తన స్వార్థం కోసం వేసిన ఎత్తుగడలు.

అసలు సమస్యలు ఉంటే కదా..

వైసీపీ పాలనలో సమస్యలు ఉంటే చంద్రబాబుకి అవకాశం ఉండేదేమో. కానీ జగన్ ఆ ఛాన్స్ బాబుకి అస్సలు ఇవ్వలేదు, ఇవ్వరు కూడా. అందుకే తనకు తాను సమస్యలను సృష్టించుకుని రెచ్చిపోతున్నారు చంద్రబాబు. మద్యం ధరలు పెంచారని, మంచి బ్రాండ్ లు అందుబాటులో లేకుండా చేశారని, విజయనగరంలో దీపస్తంభం పడేశారని, ఎన్టీఆర్ విగ్రహాలు పక్కకు జరిపారని.. ఇలా చిన్నా చితకా సమస్యలను పట్టుకుని వేలాడుతున్నారు బాబు. 

ఒకప్పుడు చంద్రబాబు ఇచ్చే కలరింగ్ ఎలా ఉండేదో ఓసారి ఊహించుకుంటే, ఇప్పుడు చంద్రబాబు పరిస్థితి ఎలా ఉందో అర్థమౌతుంది. జాతీయ స్థాయి సమస్యల్ని తాను ఒక్కడే పరిష్కరిస్తున్నట్టు.. ఇతర రాష్ట్రాల నేతలతో సంప్రదింపులు చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తూ యమ బిజీగా ఉండేవారు బాబు. ఇప్పుడేమో పూర్తిస్థాయిలో గల్లీ లీడర్ గా మారిపోయారు.

తెలుగు మీడియా అవినీతి దందా