మహేష్ ఫ్యామిలీ నుంచి మరో హీరో రెడీ

మహేష్ బాబు కొడుకు ఎప్పుడు సినిమాల్లోకి వస్తాడా అని ఘట్టమనేని అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిజానికి మహేష్ కుటుంబ సభ్యుల నుంచి గౌతమ్ తప్ప మరో వ్యక్తి వచ్చే అవకాశం లేదని కూడా అనుకుంటున్నారు.…

మహేష్ బాబు కొడుకు ఎప్పుడు సినిమాల్లోకి వస్తాడా అని ఘట్టమనేని అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిజానికి మహేష్ కుటుంబ సభ్యుల నుంచి గౌతమ్ తప్ప మరో వ్యక్తి వచ్చే అవకాశం లేదని కూడా అనుకుంటున్నారు. కానీ మహేష్ కొడుకు కంటే ముందే మరో వ్యక్తి, ఆ కుటుంబం నుంచి హీరోగా వచ్చే అవకాశం ఉంది.

తన కొడుకు సినిమాలపై బాగా ఆసక్తిగా ఉన్నాడని ప్రకటించాడు మహేష్ బావ, హీరో సుధీర్ బాబు. అన్నీ అనుకున్నట్టు జరిగితే మరో 3-4 ఏళ్లలో అతడు హీరోగా ఇండస్ట్రీకి పరిచయమౌతాడని కూడా తెలిపాడు.

“మా పెద్దబ్బాయ్ చాలా క్లారిటీతో ఉన్నాడు. వాడు సినిమాల్లోకే వస్తాడు. వాడే నటిస్తున్నాడు, వీడియోలు తీస్తున్నాడు. ఎడిటింగ్ చేస్తున్నాడు. జిమ్నాస్టిక్స్, పార్కోర్ చేస్తున్నాడు. అతడు సరైన మార్గంలోనే వెళ్తున్నాడు. అన్ని రంగాల్లో కష్టపడుతున్నాడు. నాటకాల్లో నటిస్తున్నాడు, యాక్టింగ్ నేర్చుకుంటున్నాడు. వాడికి సినిమాలంటే చాలా ఇంట్రెస్ట్. మరో 4 ఏళ్లలో కచ్చితంగా సినిమాల్లోకి వస్తాడు.”

ప్రస్తుతం సుధీర్ బాబు కొడుకు మానస్ వయసు 15 ఏళ్లు. మరో నాలుగేళ్లలో అతడు కచ్చితంగా సినిమాల్లోకి వస్తాడని చెబుతున్నాడు సుధీర్ బాబు. చూస్తుంటే, మహేష్ బాబు కొడుకు గౌతమ్ కంటే ముందే మానస్ సినిమాల్లోకి వచ్చేలా ఉన్నాడు.

మహేష్ బాబు సినిమాలో గౌతమ్ నటించినట్టుగానే, సుధీర్ బాబు సినిమాలో అతడి కుమారుడు కూడా నటించాడు. అదే మామా మశ్చీంద్ర. ఈ సినిమాలో తన పెద్దబ్బాయి ఓ చిన్న పాత్ర పోషించినట్టు వెల్లడించాడు సుధీర్ బాబు.