జితేందర్ రెడ్డి ఎవరు?

బాహుబలి మరియు ఎవ్వరికీ చెప్పొద్దు సినిమాలతో ప్రేక్షకులకి సుపరిచితులు అయిన రాకేష్ వర్రే ఎప్పుడూ ప్రయోగాత్మక పాత్రలనే ఎంచుకుంటున్నారు.  Advertisement కొద్దిరోజుల క్రితం జితేందర్ రెడ్డి అనే పేరుతో హీరో ఎవరో తెలియకుండా పోస్టర్లు…

బాహుబలి మరియు ఎవ్వరికీ చెప్పొద్దు సినిమాలతో ప్రేక్షకులకి సుపరిచితులు అయిన రాకేష్ వర్రే ఎప్పుడూ ప్రయోగాత్మక పాత్రలనే ఎంచుకుంటున్నారు. 

కొద్దిరోజుల క్రితం జితేందర్ రెడ్డి అనే పేరుతో హీరో ఎవరో తెలియకుండా పోస్టర్లు రిలీజ్ చేశారు. పోస్టర్లు చూడడానికి చాలా డిఫరెంట్ గా ఉన్నప్పటికి అందులో ఉన్న కథానాయకుడు ఎవరు?, అసలు టైటిల్ లో ఉన్న ఈ జితేందర్ రెడ్డి ఎవరు? అని చిన్న డిస్కషన్ పాయింట్ అయ్యింది. ఒక వ్యక్తి కొంత మంది జనాల ముందు కూర్చుని చిన్న పాప మీద చెయ్యి వేసి నాయకుడు శైలిలో కనిపిస్తాడు. కాని హీరో ఎవరు అనేది తెలియడం లేదు.

ఇప్పుడు ఆ సస్పెన్స్ ని రివీల్ చేస్తూ ఇంకో పోస్టర్ ని విడుదల చేశారు. జితేందర్ రెడ్డి పాత్రలో రాకేష్ వర్రే గన్ పట్టుకుని ఎంతో డైనమిక్ గా నడుచుకుంటూ వస్తున్నట్టు ఉంది ఆ పోస్ట్. చూడడానికి ఒక యంగ్ పోలీస్ లాగా ఉన్నాడు. కాకపోతే ముందు రిలీజ్ చేసిన పోస్టర్స్ లో లీడర్ లుక్స్ ఉన్నాయి. హీరోగా ఒక సినిమా చేసి హిట్ అందుకున్న తరువాత కూడా ఇంత గ్యాప్ తీసుకుని ఈ జితేందర్ రెడ్డి సినిమానే రాకేష్ ఎందుకు ఎంచుకున్నారు అన్నది త్వరలో రివీల్ చేస్తారట.

మరో ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే ఈ జితేందర్ రెడ్డి క్యారెక్టర్ కి సరైన నటుడు కోసం దర్శకుడు విరించి వర్మ దాదాపు  ఆరునెలల పాటు అనేక మందిని రిజెక్ట్ చేసి చివరికి రాకేష్ వర్రే మాత్రమే ఈ పాత్రకి సరిపోతారని నమ్మి తీసుకున్నారు. రాకేష్ ఈ క్యారక్టర్ కి ఎంత న్యాయం చేశారనేది సినిమా విడుదల తరువాత కానీ తెలియదు.