ఏం చూసుకుని.. తిట్ల దండ‌కం!

“ఎవ‌డ్రా నువ్వు…పోరా బ‌య‌టికి. థ‌ర్డ్ క్లాస్ నా కొడ‌కా…ఫ‌స్ట్ బ‌య‌టికి పంపండి. లేకుంటే ఇక్క‌డే కూర్చుంటా”

టీటీడీని సంస్క‌రిస్తాన‌ని చైర్మ‌న్‌గా బాధ్య‌త‌లు తీసుకోకుండానే బీఆర్ నాయుడు పెద్ద ఎత్తున ప్ర‌చారం చేసుకున్నారు. సీఎంగా బాధ్య‌త‌లు తీసుకున్న త‌ర్వాత తిరుమ‌ల‌కు వెళ్లిన చంద్ర‌బాబునాయుడు కూడా ఇక్క‌డి నుంచే దిద్దుబాటు మొద‌ల‌వుతుంద‌ని ప్ర‌క‌టించారు. మంచి ప‌నులు చేస్తామంటే, వ‌ద్ద‌నే వాళ్లెవ‌రు? కూట‌మిపై ఎన్నో ఆశ‌లు పెట్టుకునే అప‌రిమిత‌మైన అధికారాన్ని ప్ర‌జ‌లు క‌ట్ట‌బెట్టారు.

కానీ అనుకున్న‌దొక‌టి, అవుతున్న‌ది మ‌రొక‌టి. టీటీడీ ప్ర‌తిష్ట పెర‌గ‌డం శ్రీ‌వారు ఎరుగు, మ‌స‌క‌బారుతోంద‌న్న విమ‌ర్శ వెల్లువెత్తుతోంది. ముఖ్యంగా టీటీడీ ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ జ‌రిగింద‌ని సీఎం చంద్ర‌బాబు కామెంట్స్‌, ఆ త‌ర్వాత సుప్రీంకోర్టు అక్షింత‌లు …వెర‌సి కోట్లాది మంది హిందువుల మ‌నోభావాలు ఎవ‌రి వ‌ల్ల దెబ్బ‌తిన్నాయో అంద‌రికీ తెలుసు.

ఈ నేప‌థ్యంలో శ్రీ‌వారి ఆల‌యంలోనే టీటీడీ ఉద్యోగిపై బాధ్య‌తాయుత‌మైన బోర్డు స‌భ్యుడు నోరుపారేసుకోవ‌డం తీవ్ర విమ‌ర్శ‌ల‌కు దారి తీసింది. త‌న‌ను మ‌హాద్వారం మార్గం నుంచి వెలుప‌లికి పంప‌లేద‌నే అక్క‌సుతో టీటీడీ ఉద్యోగి బాలాజీని బెంగ‌ళూరుకు చెందిన టీటీడీ బోర్డు స‌భ్యుడు న‌రేష్‌కుమార్ నోటికొచ్చిన‌ట్టు.. వేలాది మంది భ‌క్తుల స‌మ‌క్షంలో తిట్టారు.

ఇటీవ‌ల మార్చిన నిబంధ‌న‌ల ప్ర‌కారం… బ‌యోమెట్రిక్ నుంచి వెళ్లాల‌ని బాలాజీ కోర‌డంతో బోర్డు స‌భ్యుడి అహం దెబ్బ‌తింది. దీంతో స‌ద‌రు ఉద్యోగిపై నోటికి ప‌ని చెప్పారు. “ఎవ‌డ్రా నువ్వు…పోరా బ‌య‌టికి. థ‌ర్డ్ క్లాస్ నా కొడ‌కా…ఫ‌స్ట్ బ‌య‌టికి పంపండి. లేకుంటే ఇక్క‌డే కూర్చుంటా” అని హెచ్చ‌రించారాయ‌న‌.

శ్రీ‌వారి సేవ‌లో ఉన్న టీటీడీ ఉద్యోగిపై, అది కూడా బోర్డు స‌భ్యుడు తిట్టి గంట‌లు గ‌డుస్తున్నా, ఇంత వ‌ర‌కూ పాల‌క మండలి చైర్మ‌న్‌, ఈవో, ఏఈవోల నుంచి క‌నీస స్పంద‌న రాలేదు. ఉద్యోగుల నైతిక స్థైర్యాన్ని బోర్డు స‌భ్యులే దెబ్బ‌తీసేలా వ్య‌వ‌హ‌రిస్తే, ఎవ‌రిని కాపాడ్డానికి టీటీడీ పాల‌క మండ‌లి, ఉన్న‌తాధికారుల వ్య‌వ‌స్థ ఉన్న‌దో అనే ప్ర‌శ్న త‌లెత్తింది. క‌నీసం కేసు పెట్టే ప‌రిస్థితి కూడా లేదా? శ్రీ‌వారి ఆల‌యంలో ఉద్యోగుల‌కు ఏమిటీ తిట్లు? ఏం చూసుకుని అహంకారం అనే ఆవేద‌న స్వామి వారి సేవ‌కు అంకిత‌మైన వాళ్ల నుంచి వ్య‌క్త‌మ‌వుతోంది.

10 Replies to “ఏం చూసుకుని.. తిట్ల దండ‌కం!”

  1. ఆంధ్రలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తున్నది అంటే ఓన్లీ ప్రత్యర్థుల పైనే యాక్షన్ తీసుకుంటారు సొంత వల్ల పైన కాదు. కొన్ని రోజుల తరువాత జనాలే తిరగబడి కొడతారు అంత వరకు ఇలాగే విర్ర వీగుతుంటారు

  2. కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

Comments are closed.