హైకోర్టు కామెంట్స్‌పై ఏమంటారు పోలీస్ అన్న‌లు!

లోకం క‌ళ్ల‌కు గంత‌లు క‌ట్ట‌లేమ‌ని పోలీసు అధికార సంఘం నేత‌లు గుర్తెరిగి, మాట్లాడితే బాగుంటుంద‌నే హిత‌వు పౌర స‌మాజం నుంచి వ‌స్తోంది.

త‌మ వాళ్ల‌ను అకార‌ణంగా, అన్యాయంగా ఇబ్బంది పెట్టే పోలీసు అధికారుల్ని, నాయ‌కుల్ని రానున్న రోజుల్లో బ‌ట్ట‌లూడ‌దీసి నిల‌బెడ‌తామ‌ని మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి హెచ్చ‌రించ‌డం రాజ‌కీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. మ‌రీ ముఖ్యంగా ఏపీ పోలీస్ అధికారుల సంఘానికి రోషం పొడుచుకొచ్చింది. ఈ రోషం చిన్న‌పిల్ల‌ల‌, ఆడ‌పిల్ల‌ల మాన‌ప్రాణాలు కాపాడ్డంలో ఉండి వుంటే ఏపీలో ఇన్ని అఘాయిత్యాలు జ‌రిగేవి కావేమో!

జ‌గ‌న్ అనుచిత కామెంట్స్ చేశారంటూ పోలీస్ అధికారుల సంఘం నాయ‌కులు మీడియా స‌మావేశంలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా పోలీస్ సంఘం నాయ‌కులు మాట్లాడుతూ చ‌ట్టాల‌పై జ‌గ‌న్‌పై ఏ మాత్రం గౌర‌వం లేద‌న్న సంగ‌తి ప‌రుష ప‌ద‌జాల‌మే తెలియ‌జేస్తోంద‌ని విమ‌ర్శించారు. రాజ‌కీయాల‌కు, వ‌ర్గాల‌కు, రాగ‌ద్వేషాల‌కు అతీతంగా పోలీసులు విధులు నిర్వ‌హిస్తున్నార‌ని వారు చెప్పుకొచ్చారు. ఈ మాట‌లు పోలీసులు విన‌డానికే బూత ప‌దాల్లా వినిపిస్తున్నాయ‌నే విమ‌ర్శ వెల్లువెత్తుతోంది. జ‌గ‌న్ వ్యాఖ్య‌లు అత్యంత దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని వారు పేర్కొన్నారు. స‌రే, జ‌గ‌న్ మాట‌లు పోలీసుల మ‌నోభావాల్సి దెబ్బ తీశాయ‌ని కాసేపు అనుకుందాం.

పోలీసుల తీరుపై ఏపీ హైకోర్టు …మంగ‌ళ‌వారం ఏమ‌న్న‌దో తెలుసుకుందాం. ఎందుకంటే, పోలీస్ అధికారుల సంఘం హైకోర్టు ఘాటు వ్యాఖ్య‌ల‌పై స్పందిస్తుంద‌నే ఆశ‌తో వాళ్ల దృష్టికి వాటిని తీసుకెళ్దాం.

“వ్య‌క్తుల‌పై కేసులు పెట్ట‌డం, వారిని కొట్ట‌డం, లోప‌ల వేయ‌డం త‌ప్ప మీరేం చేస్తున్నారు? ఏ కేసులోనూ ద‌ర్యాప్తు చేయ‌డం లేదు. కోర్టు ఆదేశాల‌ను చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు.ఇలాంటి తీరును స‌హించ‌బోం” అని ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్ర‌హంతో పాటు ఘాటు హెచ్చ‌రిక చేసింది. ఇలాగైతే డీజీపీని కోర్టుకు పిలిపించాల్సి వుంటుంద‌ని ఇటీవ‌ల హైకోర్టు అన్న సంగ‌తి పోలీస్ అధికారుల సంఘం నేత‌ల‌కు గుర్తుండే వుంటుంది.

కూట‌మి ప్ర‌భుత్వ మెప్పు కోసమో, మ‌రే ప్ర‌యోజ‌నాల కోస‌మో జ‌గ‌న్‌కు హిత‌వు చెప్పారు. పోలీసుల తీరుపై హైకోర్టు ఘాటు విమ‌ర్శ‌ల‌పై ఏమంటారు? అనే ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్పే ధైర్యం వుందా? రాజ‌కీయాల‌కు, వ‌ర్గాల‌కు, రాగ‌ద్వేషాల‌కు అతీతంగా పోలీసులు ప‌ని చేస్తుంటే, ఏపీ హైకోర్టు ఎందుకు ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించాల్సి వ‌చ్చిందో స‌మాధానం చెప్పాలి. అధికార కూట‌మికి జ‌గ‌న్ విరోధి కాబ‌ట్టి, పోలీస్ అధికార సంఘం నేత‌లు… మీడియా ముందుకొచ్చి బిల్డ‌ప్ మాట‌లు మాట్లాడ‌ర‌నే చ‌ర్చ జ‌రుగుతోంది.

ఇటీవ‌ల మున్సిప‌ల్‌, కార్పొరేష‌న్ సంస్థ‌ల చైర్మ‌న్లు, వైస్ చైర్మ‌న్లు, డిప్యూటీ మేయ‌ర్ల ఎన్నిక‌ల్లో పోలీసులు ఎంత చ‌క్క‌గా అధికార ప‌క్షం కోసం ప‌ని చేశారో, చేస్తున్నారో జ‌నం చూస్తున్నారు. లోకం క‌ళ్ల‌కు గంత‌లు క‌ట్ట‌లేమ‌ని పోలీసు అధికార సంఘం నేత‌లు గుర్తెరిగి, మాట్లాడితే బాగుంటుంద‌నే హిత‌వు పౌర స‌మాజం నుంచి వ‌స్తోంది.

30 Replies to “హైకోర్టు కామెంట్స్‌పై ఏమంటారు పోలీస్ అన్న‌లు!”

  1. నిన్న 7 పీఎం ఎదో బ్లాస్ట్ అన్నావు..

    ఏమైపోయావు..?

    బ్లాస్ట్ లో నీ మొఖం మాడి మసైపోయిందా..?

  2. అబ్బొ! మన జగన్ అన్న అదికారం లొ ఉనప్పుడు పాపం హై కొర్ట్ మాట్లలకి, తీర్పులకి ఎంథ గౌరవం ఎచ్చారొ!

    జగన్ అన్న ప్రబుత్వానికి ఎన్ని సార్లు హౌకొర్ట్ మొట్టికాయలు వెసింది?

    మీరు ఎ రొజు అన్న హైకొర్ట్ న్యాయమూర్తులని గౌరవించారా?

    హైకొర్ట్ న్యాయమూర్తులని ల మీద అసభ్య పదజాలంతొ ట్రొల్ల్ చెసిన బులుగు మందని ఎవరు పెంచి పొషించారు?

    చివరాకరికి నాయమూర్తుల మీద అసభ్య పదజాలంతొ ట్రొల్ల్ చెసిన వారి మీద చర్యలు తీసుకొముంటె CID ఎమి చర్యలు తీసుకుంది?

    మీరు ఎ చర్యా తీసుకొకుండా నాంచుతున్నారు అనె కదా హైకొర్ట్ అప్పుట్లొ ఆ కెసు CBI కి ఇచ్చింది!

    .

    ఇన్నాలకి హైకొర్ట్ గుర్తుకు ఉచ్చినందుకు సంతొషం!

  3. The AP police have no moral right to question Jagan. Yes, they are partial, inefficient and showing a lot of nepotism. They are not doing their constitutional duties and the high cadre IPS officers are not doing their duty because they themselves have their own selfish motives like favours from govt, promotions etc. When set your house right, please preach the morals then..

  4. జగన్ ను ప్రశ్నించే నైతిక హక్కు ఏపీ పోలీసులకు లేదన్నారు. అవును, అవి పాక్షికమైనవి, 
    అసమర్థమైనవి మరియు చాలా బంధుప్రీతి చూపిస్తున్నాయి. వారు తమ రాజ్యాంగ విధులను చేయడం లేదు
    మరియు ఉన్నత కేడర్ IPS అధికారులు తమ విధులను నిర్వర్తించడం లేదు ఎందుకంటే వారి స్వంత స్వార్థపూరిత ఉద్దేశ్యాలు
    ప్రభుత్వం నుండి ఆదరణలు, పదోన్నతులు మొదలైనవి ఉన్నాయి. మీరు మీ ఇంటిని సరిగ్గా ఉంచుకున్నప్పుడు,
    దయచేసి నీతులు బోధించండి..
    1. ఏరా 2019- 2024 TIME LO తాడేపల్లిలో తొంగున్నావా VEDAVA వాగుడు నువ్వును ?

      Appudu Speaka Lede… notlo Gorentla Ganta pettukunnavaa ?

  5. 2024 జూన్ కి ముందు పోలీసోల్లు దేవుళ్ళు… తర్వాత నుంచి రాక్షసులు అయ్యారు 😄

  6. 12 ఏళ్ళ నుండి ఒక క్రిమినల్ బెయిల్ మీద తిరుగుతున్నాడు.. కోర్ట్ కి రమ్మంటే.. ట్రాఫిక్ జాం అంటాడు..

    కోడికత్తి శీను పై విచారణ లేకుండానే 6 ఏళ్ళు జైలులో మగ్గాడు.. కత్తితో పొడిచినా అంత శిక్ష పడదని హై కోర్ట్ కి తెలియదా..?

    హై కోర్ట్ నీతుల పుస్తకాన్ని ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది..

      1. 12 ఏళ్ళ నుండి ఒక క్రిమినల్ బెయిల్ మీద తిరుగుతున్నాడు.. కోర్ట్ కి రమ్మంటే.. ట్రాఫిక్ జాం అంటాడు… ఆ బొక్క గాడి గురించి

          1. ఇంట్లో ఆడోళ్ళ గురించి మాట్లాడితే.. బ్లాక్క్ చేయడం ఒక్కటే మార్గం బొక్క బాబు..

            నీలాంటి నీచులకోసం టైం వేస్ట్ చేయాల్సిన పని లేదు..

            వేరే ఐడి చేసుకుని వచ్చి నాకు కామెంట్స్ పెట్టుకో.. బై ..

  7. ఇప్పుడు ఒక మంత్రిగా ఉండే మన లోకేష్ నాకు రాజ్యాంగం పైన నమ్మకం లేదు సొంతంగా రెడ్ బుక్ అనే వ్యవస్థతో ప్రత్యర్థులను శిక్ష వేస్తా అన్నప్పుడు ఇదే డబ్బా పోలీసులు ఏమి చేస్తున్నారో.

    1. భారత రాజ్యాంగం ప్రకారం చట్ట ప్రకారం శిక్ష విధించేలా చూస్తాను అన్నాడు..

      చట్టాన్ని బై పాస్ చేయాలనుకుంటే.. కొడాలి నాని ని ఎప్పుడో లోపలేసి ముక్కేసేవాళ్ళు..

      అంతెందుకు.. జగన్ రెడ్డి ఇంకా బయట తిరిగేవాడా..? చట్టానికి సాక్ష్యాలు కావాలి.. వాటిని సేకరించడానికి పోలీసులకు సమయం కావాలి..

      విసారే ఎందుకు సన్యాసం తీసుకున్నాడో అర్థం చేసుకో..

  8. పోలీసుల్లో అందరూ మగవారే ఉండరు కదా! ఆడవారిని కూడా కలిపి అంటున్నాడా బట్టలూడదీయిస్తానని? తన భార్యా పిల్లలందరూ ఆడవారే కదా! అసలు ఈ మనిషికి మర్యాద అనేది అసలు ఉందా? మహిళా పోలీసులతో జగన్ పై కోర్టులో కేసు పెట్టించాలి. బహిరంగంగా క్షమాపణ చెప్పించాలి.

  9. పోలీసుల్లో అందరూ మగవారే ఉండరు కదా! ఆడవారిని కూడా కలిపి అంటున్నాడా బ#ట్ట#లూడదీయిస్తానని? తన భార్యా పిల్లలందరూ ఆడవారే కదా! అసలు ఈ మనిషికి మ#ర్యా#ద అనేది అసలు ఉందా? మహిళా పోలీసులతో జగన్ పై కో#ర్టు#లో కే#సు పెట్టించాలి. బహిరంగంగా క్ష#మా#ప#ణ చెప్పించాలి.

  10. మన న్యాయమూర్తులు comments తప్ప ఏమీ చేయరు అన్న విశ్వాసం వాళ్లకు ఉన్నట్లు అనిపిస్తుంది.

  11. శకుని మామ కు ఏమాత్రం తీసిపోని రీతిలో ఉంటున్నాయి మీ రాతలు.. ఇంకా రెచ్చగొట్టండి .. విచ్చల విడిగా తిరుగుతున్న వైసీపీ అవినీతి పరులను, అక్రమార్కులను, నేరస్తులను లోపల వేసేదాక రాయండి ఇలాంటి రెచ్చగొట్టే రాతలు

  12. కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

  13. 2.o. అంటే ఏదో ఊరూరూ తిరిగి సహాయం చేస్తారు అనుకున్న

    మళ్ళీ అవే ఆడంగి డ్రామా లు

    సి గ్గు అనిపించ ట్లేదు రా y cheeps

Comments are closed.